iDreamPost
android-app
ios-app

రూ. 100కే రేంజ్ రోవర్ తో సహా ఖరీదైన కార్లు పొందే అవకాశం..!

మనకు కావాల్సిన వస్తువులు, దుస్తులు కావాలనుకుంటే పండుగ వరకు కావాల్సిందే. ఎందుకంటే ఆ సమయాల్లో వస్త్ర దుకాణాలు, హోం అప్లయన్సెస్ కంపెనీలు ఆఫర్ల ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. అవసరమనుకుంటే లక్కీ డ్రాల పేరుతో ఫారన్ ట్రిప్పులు, కార్లు, బైకులు, బంగారం ఆభరణాలు అంటూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. మరీ ఖరీదైన కార్లు కావాలంటే...

మనకు కావాల్సిన వస్తువులు, దుస్తులు కావాలనుకుంటే పండుగ వరకు కావాల్సిందే. ఎందుకంటే ఆ సమయాల్లో వస్త్ర దుకాణాలు, హోం అప్లయన్సెస్ కంపెనీలు ఆఫర్ల ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. అవసరమనుకుంటే లక్కీ డ్రాల పేరుతో ఫారన్ ట్రిప్పులు, కార్లు, బైకులు, బంగారం ఆభరణాలు అంటూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. మరీ ఖరీదైన కార్లు కావాలంటే...

రూ. 100కే రేంజ్ రోవర్ తో సహా ఖరీదైన కార్లు పొందే అవకాశం..!

‘కారులో షికారు కెళ్లే పాల బుగ్గల పసిడిదాన.. బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా’ అంటూ పాడుకునేందుకు మన దగ్గర కారు లేకపాయే. పోనీ కొందామంటే.. మధ్య తరగతి కుటుంబాలకు అందని ద్రాక్ష లెక్క. కారు ఏమన్నా పది రూపాయలకు, పదివేలకు వస్తుందా లక్షలు పోయాలి. షోరూమ్‌లో కనిపించినా , రోడ్లపై ఇష్టమైన కారు రయ్ మని కళ్లముందే దూసుకు పోతుంటే.. ఆ కారు కొనే భాగ్యం ఎప్పటికి దక్కుతుందో..? లేదా మనం ఫ్యూచర్‌లో ఇలాంటి కారు తీసేద్దాం అంటూ సర్థి చెప్పేసుకుంటాడు సగటు మనిషి. అయితే కారు కొనాలన్న కోరిక మాత్రం బలంగా ఉండిపోతుంది. మరీ రూ. 100లకే కారు దక్కే అరుదైన ఛాన్స్ వస్తుంటే.. వదులుకుంటారా..?

ఏంటీ.. రూ. 100ల చెల్లిస్తే కారు వస్తుందా..? అని సందేహంగా చదవకండి.. అది నిజమే.. మామూలు కారు కాదూ.. దేశంలోనే అత్యంత లగ్జరీ కారు రేంజ్ రోవర్. అయితే దానికి కాస్తంత అదృష్టం కూడా ఉండాలి. ఇంతకు ఈ ఖరీదైన కారును పొందాలంటే అస్సాం వెళ్లిపోవాల్సిందే. ఎందుకంటే..? అక్కడ హౌలీలో ప్రతి యేటా రాస్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. రాధా కృష్ణుల మధ్య ప్రేమకు గుర్తుగా ఈ పండుగ నిర్వహిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. కార్తీక పూర్ణిమ సమయంలో వస్తుందీ పండుగ. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించే లాటరీలో ఖరీదైన బహుమతులు అందజేస్తారు. నామ మాత్రపు టికెట్ ధరతో ఖరీదైన కార్లను లాటరీలో కొల్లగొట్టొచ్చు అన్నమాట. అలాగే ఈ ఏడాది జరిగే వేడుకలో కూడా కాస్ట్లీ వస్తువులను అందజేయనున్నట్లు నిర్వాహకులు తాజాగా ప్రకటించారు.

మొదటి బహుమతిగా రూ. 76 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్ కారును ఉంచనున్నారు. ఈ లాటరీలో పాల్గొనేందుకు కేవలం రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. ఆ తర్వాత బహుమతులుగా. రూ. 50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్, స్కార్పియో, స్కోడా కుషక్, నెక్సాన్ వంటివి ఉండటం విశేషం. ఇక ప్రకటన ఇలా వెలువడిందో లేదో.. అలా టికెట్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు జనాలు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. లాటరీ విజేతలను డిసెంబర్ 10న వెల్లడిస్తారు. గత ఏడాది వేడుకల్లో లాటరీ నిర్వహించి.. తొలి విజేతకు ఆడికారును అందజేశారు. గుహవాటికి చెందిన జనార్థన్ బోరో అనే పోలీసు అధికారి దీన్ని గెలుచుకున్నాడు. ఈ ఏడాది వచ్చే నెల 24 నుండి డిసెంబర్ 10 వరకు రాస్ వేడుకలు జరగనున్నాయి.