టీ20 రిటైర్మెంట్ పై రోహిత్ ట్విస్ట్! 2026 టీ20 వరల్డ్ కప్ పై సంచలన ప్రకటన!

Rohit Sharma, Retirement, IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌ కోసం రెడీ అవుతున్న క్రమంలో రోహిత్‌ శర్మ.. టీ20లకు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడే. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Rohit Sharma, Retirement, IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌ కోసం రెడీ అవుతున్న క్రమంలో రోహిత్‌ శర్మ.. టీ20లకు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడే. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు టీమిండియా రెడీ అయింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు శుక్రవారం కొలంబో వేదికగా తొలి వన్డే ఆడనుంది. ఈ క్రమంలో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న రోహిత్‌ శర్మ.. తన టీ20 రిటైర్మెంట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ గెలిచిన తర్వాత.. విరాట్‌ కోహ్లీతో పాటు రోహిత్‌ శర్మ సైతం అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత. తొలిసారి రోహిత్‌ శర్మ గ్రౌండ్‌లోకి దిగనున్నాడు.

అయితే.. తనకు టీ20 ఫార్మాట్‌ నుంచి రిటైర్‌ అయినట్లు అనిపించడం లేదని, గతంలో ఇచ్చినట్లే.. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు రెస్ట్‌ ఇచ్చి.. ఒక బిగ్‌ టీ20 ఈవెంట్‌(టీ20 వరల్డ్‌ కప్‌ 2026) ఆడబోతున్న ఫీలింగ్‌ వస్తుందని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. రిటైర్మెంట్‌ అయితే.. ప్రకటించాను కానీ, ఒక ఫార్మాట్‌కు పూర్తిగా దూరం అయిన విషయం ఇంకా తన మైండ్‌ యాక్సప్ట్‌ చేయలేదనే ఉద్దేశంతో రోహిత్‌ శర్మ మాట్లాడాడు. అయితే.. రోహిత్‌ శర్మ అభిమానులు మాత్రం.. రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ నుంచి బయటికి వచ్చి.. టీ20లు మరికొంత కాలం పాటు ఆడాలని, వీలుంటే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2026 ఆడాలని కోరుకుంటున్నారు.

2007 టీ20 వరల్డ్‌ కప్‌ ఆడిన రోహిత్‌ శర్మ.. దాదాపు 17 ఏళ్లు ఆ ఫార్మాట్‌లో రాణించి.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపి.. కప్పు గెలిచి టీ20కు గుడ్‌బై చెప్పాడు. ఇకపై వన్డేలు, టెస్టులపైనే రోహిత్‌ శర్మ పూర్తి స్థాయిలో ఫోకస్‌ పెట్టనున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2025 పై రోహిత్‌ శర్మ కన్నేశాడు. ఇప్పుడు టీ20 రిటైర్మెంట్‌పై రోహిత్‌ శర్మ కేవలం సరదాగా కామెంట్‌ చేశాడు. మరి రోహిత్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments