iDreamPost
android-app
ios-app

రోబోలుగా మారిన సభ్యులు – ఓపిక టాస్కులో కన్నీళ్లు

  • Published Dec 09, 2020 | 6:19 AM Updated Updated Dec 09, 2020 | 6:19 AM
రోబోలుగా మారిన సభ్యులు – ఓపిక టాస్కులో కన్నీళ్లు

ఇంకో పన్నెండు రోజుల్లో రాబోతున్న బిగ్ బాస్ 4 ఫినాలే కోసం రంగం సిద్ధమవుతోంది. వంద రోజుల ప్రహసనానికి శుభం కార్డు పడబోతోంది. గెస్ట్ ఎవరు వస్తారు ఫైనల్ కంటెస్టెంట్స్ గా ఎవరి మధ్య పోటీ ఉంటుందనే విషయాల మీద ఇంకా క్లారిటీ రాలేదు కానీ మొత్తానికి సభ్యులు ఒక్కొక్కరుగా తమ చివరి అస్త్రాలను తీస్తున్నారు. నవ్ ఆర్ నెవెర్ అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకుని మరీ యుద్ధం చేస్తున్నారు. ఇక నిన్నటి సంగతి చూస్తే అరియనా, మోనాల్ ల మధ్య ఏ రేంజ్ లో పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఉన్నాయో బయటపడింది. టాస్కులో భాగంగానే అయినప్పటికీ వీళ్ళ ఫీలింగ్స్ ని బయటికి రప్పించడంలో బిగ్ బాస్ వేసిన ఎత్తుగడ పారింది.

ఇందులో భాగంగా హౌస్ మేట్స్ ని కదలకుండా ఎలాంటి ఎక్స్ ప్రెషన్లు ఇవ్వకుండా రోబోలా కూర్చోవాలని చెప్పాడు. మిగిలినవాళ్లను అతను లేదా ఆమె నుంచి వీలైనన్ని హావభావాలను రప్పించాలి. దాని కోసం ఏమైనా చేయొచ్చు. ఈ వివరాలు అఖిల్ బోర్డు మీద నోట్ చేసుకుంటాడు. అంతే కాదు నాలుగు డిఫరెంట్ ఫేస్ ఫీలింగ్స్ ఉన్న బొమ్మలను అక్కడే గార్డెన్ ఏరియాలో ఉంచుతారు. ఏ బొమ్మ లైట్ వెలిగితే అప్పుడు రోబోలా కూర్చున్న పార్టిసిపెంట్ తో సరిగ్గా అలాగే చేయించాలి. ఇక్కడే అరియనా చాలా సీరియస్ గా ఆడింది. ఎంత ట్రై చేసినా అంత తొందరగా లొంగలేదు. నాలుగు ఎక్స్ ప్రెషన్లతో సరిపెట్టింది.

ఇదే అరియనా మోనాల్ ల మధ్య రగడకు కారణమయ్యింది. తనను కవ్వించే ప్రయత్నం చేసిన మోనాల్ ని అరియనా గట్టిగానే టార్గెట్ చేసింది. దీనికి బదులుగా మోనాల్ ఎప్పటిలాగే మరోసారి కన్నీటి సముద్రాన్ని పారించి బిగ్ బాస్ తో కూడా మొరపెట్టుకుంది. దెబ్బకు జడుసుకున్న అరియనా హారికను తీసుకొచ్చి ఓదార్పు చేయించే దాకా కొంత కూడా శాంతించలేదు. అంతేకాదు బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మరీ బుజ్జగించాల్సి వచ్చింది. ఇక ఈ రోజు కూడా అరియనా, సొహైల్ మధ్య పెద్ద సమరమే జరిగేలా ఉంది. మొత్తానికి ఈ పది రోజులు వీర భయంకర యుద్ధాలతో బిగ్ బాస్ మాంచి వేడి మీద జరిగేలా ఉంది.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetholiganbetKingroyal girişJojobet GirişcasibomHoliganbetgalabet girişHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbetjojobetjojobetcasibomcasibom