iDreamPost
iDreamPost
అమెరికాలో పెట్రోల్ దొంగలు పెరిగారు. గ్యాస్, పెట్రోల్ రేట్లు పెరగడంతో , గ్యాస్ స్టేషన్ ల నుంచి ఎత్తుకెళ్తున్నారు. వాటిని దూరంలోని వేహికల్స్ కి తక్కువ రేట్లకు అమ్ముతున్నారు. ఈ పెట్రోల్ ను అమ్మడానికి యాప్ ను తయారుచేసి, ఎక్కడెక్కడ సేల్స్ ఉంటాయో కూడా చెబుతున్నారు. సోషల్ మీడియాలోకూడా ప్రచారం చేస్తున్నారు. ప్రతి నాలుగు బంకుల్లో కనీసం ఒకదానిలో దొంగతనం జరిగిందంట. ఈ దొంగలు తమకు తాము పెట్రోల్ రాబిన్ హుడ్స్ గా పిలుచుకొంటున్నారు.
పెట్రోల్ దొంగతనం ఎలా చేస్తారు?
ఒకరిద్దరుకాదు, పెట్రోల్ దొంగతనమన్నది ఒక బిజినెస్ గా మారిపోయింది. పాత వేహికల్స్ ను పెట్రోల్ ట్యాంకర్ గా మార్చి , దానికి పంపును బిగిస్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ నుంచి దొంగతనం చేసి, ఎత్తుకెళ్తున్నారు. కొందరున్నారు, వాళ్లు టెక్నికల్ గా తెలివైనవాళ్లు. సైబర్ ఎటాక్స్ చేస్తారు. సిస్టమ్ ని ఓవర్ రైడింగ్ చేసి, వందలీటర్లు పెట్రోల్ తీసుకున్నా, లీటర్ గానే చూపించేలా సిస్టమ్ ని మార్చుతారు. ఇది ఎలక్ట్రానిక్ దొంగతనం. ఇంకొందరైతే డైరెక్టర్ గా ట్యాంకర్ నుంచి పెట్రోల్ ను ఎత్తుకెళ్తారు.
పెట్రోల్ ట్యాంక్ లకు వాళ్లు చిల్లుపెడుతున్నారు. అక్కడ నుంచి వందల కొద్ది లీటర్ల మేర పెట్రోల్ ను ఎత్తుకెళ్తున్నారు. ఉన్నవాడని కొట్టి లేనివాడికి పెడితేనే కదా రాబిన్ హుడ్ గా పిలిచేది. ఈ పెట్రోల్ దొంగలెందుకు ఈ పేరు పెట్టుకొంటున్నారు? అయినా పెట్రోల్ బంక్ యజమానికి, పెట్రోల్ రేట్లు పెరగడానికి సంబంధమేంటి? అతనుచేస్తోంది వ్యాపారమేకదా?
అందుకే దొంగలు పెట్రోల్ దొంగతనం చేసి, లేనివాళ్లకు ఫ్రీగా ఇస్తున్నారు. మరికొందరికి తక్కువ రేట్లకు మనిషికి ఇంత చొప్పున పంపిణీ చేస్తున్నారు.
ఇప్పుడు గ్యాస్ స్టేషన్ ల దగ్గర కాలపాను పెంచారు. దీనివల్ల మరికొంత ఖర్చుపెరిగింది. కొందరైతే దొంగతనాలను తట్టుకోలేక రాత్రి అయితేచాలు, తుపాకులు పట్టుకొని కాపలాగా ఉండాల్సి వస్తోంది.
కన్నుముసి తెరిచేలోగా ట్యాంక్ లకు కన్నాపెట్టి పెట్రోల్ దోచుకొంటున్నవాళ్లను ఎలా అడ్డుకోవాలో అర్ధంకావడంలేదు. కొందరు వేహికల్స్ కి పెట్రోల్ ను నింపుకొనే మిషనరీని పెట్టుకొని మరీ దొంగతనాలకు దిగుతుంటే వాళ్లు మాత్రం ఏం చేయగలరు?