iDreamPost
android-app
ios-app

కమలా హారీస్- ట్రంప్ మధ్య హోరా హోరీగా తొలి డిబేట్.. ఎవరిది పై చేయి అంటే..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నవంబర్ 5న ఎన్నికలు జరగుతుండటంతో ప్రచారం పీక్స్‌కు చేరింది. అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్, మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ క్యాండిడేట్ డొనాల్ట్ ట్రంప్ హోరా హోరీగా తొలి డిబేట్ సాగింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నవంబర్ 5న ఎన్నికలు జరగుతుండటంతో ప్రచారం పీక్స్‌కు చేరింది. అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్, మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ క్యాండిడేట్ డొనాల్ట్ ట్రంప్ హోరా హోరీగా తొలి డిబేట్ సాగింది.

కమలా హారీస్- ట్రంప్ మధ్య  హోరా హోరీగా తొలి డిబేట్.. ఎవరిది పై చేయి అంటే..?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. నవంబర్ 5న ఎన్నికలు జరగుతుండటంతో ప్రచారం మరింత జోరందుకుంది. అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్, మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ క్యాండిడేట్ డొనాల్ట్ ట్రంప్ ప్రచార పర్వం పీక్స్‌కు చేరింది. మళ్లీ అధికారాన్ని చేపట్టాలని తహతహలాడుతున్నాడు ట్రంప్. ఇక భారతమూలాలున్న, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్.. తొలిసారిగా అధ్యక్ష రేసులో పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు విడివిడిగా తమ ప్రచారాన్ని కొనసాగించారు. తొలిసారిగా ఈ హేమాహేమీలు టీవీ డిబెట్‌లో తలపడ్డారు. పెన్సిల్వేనియాలో రాష్ట్రంలోని ఫిలదెల్పియాలో తొలి ముఖాముఖి డిబేట్ జరిగింది. షేక్ హ్యాండ్స్‌తో మొదలైన వీరి పోరు.. ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఇమ్మిగ్రేషన్, పునరుత్పత్తి హక్కులు, ఉక్రెయిన్- రష్యా యుద్దం, ఆరోగ్య సంరక్షణ, విదేశాంగ విధానం వంటి అంశాలపై హోరా హోరీ చర్చ నడిచింది.

తాను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చానని, అందుకే అమెరికా సగటు ప్రజల జీవితాలను మెరుపర్చడానికి తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని కమలా తెలిపారు. స్టార్టప్‌ల కోసం పన్నులు తగ్గించే యోచన చేస్తున్నట్లు, చిరు వ్యాపారులకు అండగా నిలుస్తానని కమలా హారీస్ హామీనిచ్చారు. ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన వ్యయం అంశాలపై మీ ఆలోచనలు ఏమిటని ప్రశ్నించగా ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ఇక బిలియనీర్లు, పెద్ద కంపెనీలపై పన్నుల భారాల నుంచి ఉపశమనం కల్పిస్తానని పేర్కొన్నారు. పతనమైన ఆర్థిక వ్యవస్థను ప్రస్తుత అధ్యక్షడు జో బైడెన్ మెరుగుపర్చారని పేర్కొన్నారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ..యుఎస్‌ అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉందని, అయితే వీరు అధికారంలోకి వచ్చాక చరిత్రలోనే అత్యంత దారుణమైన ద్రవ్యోల్బణం యుఎస్ చవి చూస్తుందని, దీనికి బైడెన్ ప్రభుత్వమే కారణమంటూ నిందిచాడు ట్రంప్. దీనికి గట్టిగా కౌంటరిచ్చారు హారీస్.

ట్రంప్ ప్రభుత్వం దిగిపోయిన సమయంలో తమకు తీవ్ర ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం ఇచ్చారని, అంతర్యుద్ధం తర్వాత మన ప్రజాస్వామ్యంపై అత్యంత దారుణమైన దాడిని ట్రంప్ మిగిల్చారని అన్నారు. ఒక శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య మహమ్మారి కరోనా సమస్యను అందించి వెళ్లారంటూ చురకలు అంటించారు. ట్రంప్ కరోనా మహమ్మారి సమయంలో తాను చాలా గొప్పగా విధులు నిర్వహించానని, పోరాటమే చేశామని, అయితే దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదని సర్ది చెప్పుకునే ప్రయత్నించారు. ఇదే క్రమంలో ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు సరైన ప్రణాళికలు లేవని, తన ప్లాన్స్ కాపీ చేస్తుందంటూ మాట్లాడారు. ఆమె తండ్రి ఓ మార్కిస్ట్ అని.. ఆ పిచ్చి విధానాలతో దేశాన్ని నాశనం చేయాలని చూస్తుండని ఆరోపించారు ట్రంప్.

అలాగే అబార్షన్స్ విషయంపై కూడా ఇద్దరు పోటీ పోటీగా చర్చించుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడైతే.. అబార్షన్లను నిషేధిస్తారని అన్నారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. ఆమె అబద్దం చెబుతుందని, అలాంటి చట్టాన్ని చేయబోనని అన్నారు. అయితే తొమ్మిదో నెలలో బేబీని చంపడం సరికాదని అన్నారు. అలాగే ఆమె దేశాన్ని నాశనం చేస్తుందని, ఆమె అధ్యక్షురాలైతే అమెరికా మరో స్టెరాయిడ్స్ వినియోగంతో మరో వెనిజులా అవుతుందంటూ అక్రమ వలసలపై కమలా, బైడెన్ పై దాడి చేశారు ట్రంప్. దీనిపై కమలా హారీస్ స్పందిస్తూ.. ఆయన అబద్దాలను ప్రచారం చేస్తున్నారని, అందుకే ఆయన ప్రచారాలకు ఎవ్వరూ వెళ్లడం లేదంటూ కౌంటరిచ్చారు. ఇదే క్రమంలో ఒహియోలో హైతీ వలసదారులు కుక్కలను తినడం కుట్ర అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాట్లాడడం ట్రంప్ మొదలు పెట్టగా.. ఆమె నవ్వుకున్నారు.

దేశంలోకి ఉగ్రవాదులు, నేరస్థులకు అనుమతిస్తున్నారంటూ, డ్రగ్ డీలర్లను అమెరికాలోకి రానిస్తున్నారంటూ.. వారు ఓట్లను పొందుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ట్రంప్. అలాగే ఆమె పుట్టుకపై మరోసారి విమర్శలు చేశారు. ఆమె జమైకా-భారతీయురాలంటూ మాట్లాడారు. దీన్ని తిప్పికొట్టారు కమలాహారీస్ ఆయనకు ఎప్పుడు విభజించి పాలించు విధానం ఇష్టపడుతుంటారని..అలాంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలని కోరుకోవడం మన ఖర్మ అంటూ విమర్శించారు.. రష్యా-ఉక్రెయిన్ చర్యల్లో ఈ ఇద్దరు నేతలు విఫలమయ్యారని అనగా.. అబద్దాలు చెబుతూనే ఉన్నారని అంటూ.. తమ వినతిని రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించాడంటూ పేర్కొన్నారు. సుమారు ఇద్దరి మధ్య 90 నిమిషాల పాటు చర్చ నడిచింది. అయితే ట్రంప్‌తో పోలీస్తే.. కమలా హారీస్‌తో స్పష్టమైన పైచేయి సాధించిందని మీడియా కోడై కూస్తుంది. దీంతో ఆమె గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.