iDreamPost

అతను ధోని లాంటోడు.. వాళ్లిద్దరిలా ఆడేటోడు లేడు: పాంటింగ్‌

  • Published Jul 05, 2023 | 6:59 PMUpdated Jul 05, 2023 | 6:59 PM
  • Published Jul 05, 2023 | 6:59 PMUpdated Jul 05, 2023 | 6:59 PM
అతను ధోని లాంటోడు.. వాళ్లిద్దరిలా ఆడేటోడు లేడు: పాంటింగ్‌

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ఇంగ్లండ్‌ టెస్ట్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను టీమిండియా మాజీ కెప్టెన్‌తో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌ను ఫినిష్‌ చేసే విషయంలో స్టోక్స్‌, ధోనిలా ఆడుతున్నాడంటూ ప్రశంసలు కురిపించాడు. గతంలో టీమ్‌ని గెలిపించేందుకు ధోని చివరి వరకు క్రీజ్‌లో పాతుకుపోయి ఆడేవాడని మళ్లీ ఇప్పుడు బెన్‌ స్టోక్స్‌ సైతం అలాంటి ఆట తీరునే ప్రదర్శిస్తున్నాడంటూ మెచ్చుకున్నాడు. వీళ్లిద్దరు తప్పితే.. ఇంకెవ్వరు అలా ఆడుతున్నట్లు నాకు కనిపించలేదని అభిప్రాయపడ్డాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ సరీస్‌లో భాగంగా జరిగిన రెండో టెస్టు చివరి రోజు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టోక్స చూపించిన పోరాటపటిమపై పాంటింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాంటింగ్‌ మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఒత్తిడిని తట్టుకుని ఎవరైనా ఆడగలరు. కానీ బెన్ స్టోక్స్‌లా మిడిలార్డర్, లోయరార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటం అంత ఈజీ కాదని అన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ ఇలానే మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడేవాడు. తన అద్భుత ప్రదర్శనతో ఎన్నో మ్యాచ్‌ల్లో ధోనీ భారత్‌ను గెలిపించాడని పేర్కొన్నాడు.

ఇప్పడు టెస్ట్‌ల్లో బెన్ స్టోక్స్.. ధోనీలా విజయాలు అందిస్తున్నాడని అన్నాడు. క్రికెట్ చరిత్రలో ఈ ఇద్దరిలా మ్యాచ్‌లు ముగించిన ఆటగాళ్లు పెద్దగా లేరని భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ముఖ్యంగా కెప్టెన్‌గా ఉండి మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడినవారు ఒక్కరు కూడా లేరని పేర్కొన్నాడు. మరి స్టోక్స్‌ విషయంలో పాంటింగ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి