iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ కేవలం ఓటీటీ కోసమే సినిమాలు తీస్తోందా.. ఆర్జీవీ వ్యాఖ్యలు..

  • Published May 13, 2022 | 5:55 PM Updated Updated May 13, 2022 | 5:56 PM
  • Published May 13, 2022 | 5:55 PMUpdated May 13, 2022 | 5:56 PM
బాలీవుడ్ కేవలం ఓటీటీ కోసమే సినిమాలు తీస్తోందా.. ఆర్జీవీ వ్యాఖ్యలు..

గత కొన్ని రోహులుగా సౌత్ సినిమాలన్నీ బాలీవుడ్ లో విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఓ రకంగా చెప్పాలంటే బాలీవుడ్ ని సౌత్ సినిమాలు శాసిస్తున్నాయి. మన సినిమాలు అక్కడి థియేటర్లలో భారీ విజయం సాధించడం, మన సినిమాలని రీమేక్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించడం.. ఇలా బాలీవుడ్ లో సౌత్ డామినేషన్ కనిపిస్తుంది.

దీంతో గత కొన్ని రోజులుగా సౌత్, బాలీవుడ్ అని చర్చలు, మాటల యుద్దాలు కూడా జరుగుతున్నాయి. దీనిపై సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. ఇక తనేం చేసినా వైరల్ అయ్యేలా చేసే డైరెక్టర్ ఆర్జీవీ కూడా ఈ బాలీవుడ్ పై వ్యాఖ్యలు చేశాడు. గతంలోనే బాలీవుడ్ పై వరుస ట్వీట్లు చేసిన ఆర్జీవీ తాజాగా మరో ట్వీట్ చేసి దుమారం లేపాడు.

ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ లో.. బాలీవుడ్ థియేటర్లలోకి వెళ్లి మరీ సౌత్ ఇండియా చిత్రాలు సక్సెస్‌ సాధిస్తున్నాయి, నార్త్ సినిమాలు థియేటర్ కే వెళ్లట్లేదు. ఇది చూస్తుంటే బాలీవుడ్‌ కేవలం ఓటీటీల కోసమే సినిమాలు తీసే పరిస్థితి కనిపిస్తోంది అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. అయితే ఆర్జీవీ చెప్పింది కూడా నిజమే, ఇటీవల బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీ ద్వారానే రిలీజ్ అవుతున్నాయి. మరి దీనిపై ఎవరైనా బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తారేమో చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetador girişgrandpashabet