iDreamPost
iDreamPost
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించే సరికి ప్రజల మధ్య వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పేరిట రాష్ట్రల మధ్య సరిహద్దులను మూసివేస్తు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే . అయితే తాజాగా అన్ లాక్ 3.0 పేరిట రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఉన్న నిబంధనలు సడలిస్తు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర సరిహద్దుల దగ్గర నిబంధనలు సడలిస్తు కొన్ని మార్గదర్శకాలు నిర్దేశిస్తు ప్రకటన విడుదల చేసింది.
ఈ సందర్భంగా కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణ బాబు మాట్లాడుతు పొరుగు రాష్ట్రాలనుండి ఆంధ్రప్రదేశ్ లోకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని, అలా దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే ఈ-పాస్ సదరు వ్యక్తి వెబ్ సైట్ లో ఇచ్చిన ఫోన్ నెంబర్ కు, ఈమేయిల్ కు మేసేజ్ రూపంలో వస్తుందని, ఈ పాస్ వచ్చిన వారు ఆ పాస్ తో పాటు గుర్తింపు కార్డుని కూడా రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ దగ్గర చూపిస్తే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తారని చెప్పుకొచ్చారు.
చెక్ పోస్ట్ దగ్గర ఈ సమాచార సేకరణ, రాష్ట్రంలోకి వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమే అని , ఈ సమాచారాన్ని ఆరోగ్య కార్యకర్తలకు పంపుతామని వారు రాష్ట్రంలోకి వచ్చే వారి ఆరోగ్యం పై దృష్టి సారిస్తారు అని ఆగస్ట్ 2 నుండి ఈ విధానం అమలు లోకి వస్తుందని, ఒక వేల ఈ పాస్ నమోదు చేసుకోకుండా, పాస్ లేకుండా ఎవరు సరిహద్దు దగ్గరకి వచ్చినా వారిని రాష్ట్రంలోకి అనుమతించమని వారిని వెనక్కు తిప్పి పంపుతామని చెప్పరు. నేటి నుండి రాష్ట్రంలోకి రావాలి అనుకునే వారు ఈ-పాస్ రిజిస్టేషన్ కోరకు https://www.spandana.ap.gov.in/ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.