రెడ్ అలెర్ట్, 14 వరకు భారీ వ‌ర్షాలే

భారీ వర్షాల మధ్య తెలంగాణ విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవు ప్రకటించింది. ఒడిశా సమీపంలో ఏర్పడిన అల్పపీడనం, దక్షిణ ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 14 వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్ర‌క‌టించింది. రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. సోమవారం నుంచి అన్ని విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవు ప్రకటించారు. కేబినెట్‌ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర అధికారులతో జరిగిన సమావేశంలో పరిస్థితిని సమీక్షించిన కేసీఆర్ ముందుస్తుగా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను అడిగితెలుసుకున్నారు.

తెలంగాణ అంత‌టా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైద‌రాబాద్ లో కాస్త తెరిపిచ్చినా, సాయంత్రం నుంచి మ‌ళ్లీ భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌న్ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా. నిజామాబాద్‌, జగిత్యాల, భూ పాలపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ములుగు, కొత్తగూడెం, ఖ మ్మం, జనగామ, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్ముకొండ, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావ‌ర‌ణ శాఖ‌. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవ‌స‌ర‌మైతే త‌ప్ప‌, ఇంట్లోంచి బైట‌కు రావ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌ను కోరింది.

Show comments