iDreamPost
android-app
ios-app

రికారులు బ్రేక్‌..!

  • Published Oct 15, 2020 | 3:22 PM Updated Updated Oct 15, 2020 | 3:22 PM
రికారులు బ్రేక్‌..!

ఉభయతెలుగు రాష్ట్రాల్లోనూ కురుస్తున్న వర్షాలు రికార్డులను బ్రేక్‌ చేస్తున్నాయి. తుఫాను గానీ, వాయుగుండం గానీ పడితే తప్ప వర్షాలు కురవని పరిస్థితుల గతంలో ప్రజలు చూసారు. అయితే ఇప్పుడు సాధారణ వర్షాకాలం సమయంలోనే అత్యధిక వర్షాలు పడి పాత రికార్డులకంటే మెరుగైన రికార్డులుగా నమోదువుతుండడం గమనార్హం. వీటికి తుఫానులు, వాయుగుండాలు అదనంగా వర్షాలు కురవడానికి కారణమవుతున్నాయి.

ప్రభుత్వ నివేదికల ప్రకారం ఏపీలో రెండు జిల్లాలు మినహా సాధారణ వర్షపాతానికంటే ప్రతి జిల్లాలోనూ అత్యధిక వర్షపాతం నమోదైంది. 1.6.20 నుంచి 15.10.20 వరకు పరిగణనలోకి తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో సాధారణ వర్షపాతానికంటే ప్రస్తుతం 40శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. విజయనగరంలో 38.1శాతం, విశాఖలో 30.7, తూర్పుగోదావరిలో 9.6, పశ్చిమగోదావరిలో 56, కృష్ణాలో 29.8, గుంటూరులో 68.1, నెల్లూరులో 41.1శాతం, కడపలో 55.5శాతం, అనంతపురం 20.3శాతం, కర్నూలులో 19.8శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. అయితే ప్రకాశంలో ఏడుశాతం తక్కువగా, చిత్తూరులో 17శాతం తక్కువగాను వర్షపాతం నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి.

తెలంగాణాలోసైతం ఇదే ఇదేవిధంగా అధికవర్షపాతం నమోదైంది. సాధారణంగా తక్కువ వర్షపాతం నమోదువుతుంది. అయితే అనూహ్యంగా అక్టోబరు నెలలోని 14 రోజుల్లోనే భారీ వర్షాలు ఇక్కడ కురిసాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క హైదరాబాదు నగరంలోని రెయిన్‌ఫాల్‌ను లెక్కేస్తే సాధారణం కంటే 404 రెట్లు అధికంగా వర్షం కురిసింది. మిగిలిన తెలంగాణా జిల్లాల్లో మాత్రం సరాసరి 54శాతం అధికంగా నమోదైంది. అక్టోబరు నెలలో తెలంగాణా పరిధిలోని జిల్లాల్లో సాధారణ వర్షపాతం 3 మి.మిలకు అటూఇటూగా ఉంటుంది. కానీ ఈ సారి 5.7గా నమోదైంది. అంటే దాదాపు రెట్టింపు వర్షపాతం కురిసినట్టే లెక్క.

జూన్‌ నుంచి అక్టోబరు వరకు కూడా 78 సెంటీమీటర్ల వర్షపాతం సాధారణంగా నమోద కావాల్సి ఉండగా 120.6 సెంటీమీటర్లు నమోదైంది. తెలంగాణా ప్రాంతంలో 24 గంటల్లోనే ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదు కావడం అక్కడి భారీ వర్షాల తీవ్రకు అద్దం పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో మాత్రం వర్షపాత లోటు నమోదు కావడం గమనార్హం.

మొత్తానికి సరాసరిన చూస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సారి సాధారణంకంటే దాదాపు రెట్టింపునకు పైగా వర్షపాతం నమోదైందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా మరికొన్ని రోజులు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ లెక్కలు ఇంకెంతగా పెరుగుతాయో వేచి చూడాలి.