Venkateswarlu
కల్కీ 2898 AD మూవీకి సంబంధించి తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. రీ ఇమాజిన్ ఆఫ్ గన్స్‌కు సంబంధించిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
కల్కీ 2898 AD మూవీకి సంబంధించి తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. రీ ఇమాజిన్ ఆఫ్ గన్స్‌కు సంబంధించిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Venkateswarlu
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘కల్కీ 2898 AD’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరావేగంగా సాగుతోంది. కల్కీ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. 2024, జనవరి 12వ తేదీన మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ఈ చిత్రానికి ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. ప్రభాస్‌కు జంటగా దీపికా పదుకొనే నటిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పఠానీ, పశుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కల్కీకి సంబంధించి బయటకు వస్తున్న ప్రతీ అప్‌డేట్‌కు మంచి స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వెళుతున్నాయి. తాజాగా, ఈ మూవీకి సంబంధించి ఓ వీడియో విడుదల అయింది. ఆ వీడియోలో సినిమా కోసం ఉపయోగించిన గన్స్ తయారీ విధానం ఉంది. సాధారణ సినిమాల్లో వాడే గన్స్ కాకుండా కొత్త రకం గన్స్ తయారు చేయించి మరీ మూవీ కోసం వాడారు.
ఫ్రమ్ స్క్రాచ్ ఎపిసోడ్ 3 పేరిట ఈ వీడియో విడుదల అయింది. 1.37 నిమిషాల నిడివి ఉన్న వీడియో చాలా ఫన్నీగా సాగింది. కల్కీ మూవీలో వాడిన గన్స్ హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తీసిపోనివిగా ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చిన గంటలోనే 77 వేలకు పైగా వ్యూస్ తెచ్చుకుంది. కాగా, దర్శకుడు నాగ్ అశ్విన్ 2018లో ‘మహానటి’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా సక్సెస్ సాధించింది.
ఆ తర్వాత 2020లో నాగ్ అశ్విన్ పిట్ట కథలు అనే ఆంకాలజీ సినిమా చేశారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. నాగ్ అశ్విన్ 2019లోనే ‘కల్కీ’ మూవీ గురించి వెల్లడించారు. భారీ బడ్జెత్‌తో చిత్రం తీయబోతున్నట్లు ప్రకటించారు. 2020 ఫిబ్రవరి నెలలో ‘కల్కీ’ మూవీకి సంబంధించి అఫిషియల్ అప్‌డేట్ వచ్చింది. దాదాపు 600 కోట్ల రూపాయలతో మూవీని తీస్తున్నట్లు అశ్వినీ దత్ ప్రకటించారు. 2023, జులై 19న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది.
ఆ పోస్టర్‌కు నెగిటివ్ స్పందన వచ్చింది. దీంతో నిర్మాతలు దాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేశారు. తర్వాత వేరే లుక్‌ను వదిలారు. మరి, దాదాపు 600 కోట్ల రూపాయలతో విడుదల అవుతున్న ఈ సినిమాపై మీ అంచనాలను, అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.