iDreamPost
iDreamPost
సెలబ్రిటీలు, బిజినెస్ టైకూన్ లు వస్తున్నారంటే గంట ముందుగానే మనకు తెలిసిపోతుంది. ఆ హడావిడి, ఆ హంగామా, ఆ సెక్యూరిటీ. నిజానికి ఆయన మనకు తెలిసిన సెలబ్రిటీలు, టైకూన్ లకన్నా లెజండ్. ముంబైలోని తాజ్ హోటల్ కి ఆయన వస్తున్నారన్న విషయంకాని, ఆయన వెళ్తున్న సంగతి కాని ఎవరికీ తెలియదు. చుట్టూ సెక్యూరిటీ గార్డులు లేరు. ఆయన వచ్చింది దేశంలోనే చౌకైన కారులో. వ్యక్తిగత సహాయకుడు మాత్రమే వెంట ఉన్నాడు. హోటల్ సిబ్బంది సాగనంపారు. ఆయన పేరు రతన్ టాటా. ఆయన వచ్చిన కారు నానో. అది ఎలక్ట్రిక్ నానో కారు. ఆయన దగ్గరుండి తయారుచేయించుకున్నారు.
ఆయన సింపుల్ సిటీ సోషల్ మీడియా మనసును గెల్చుకుంది. ఆయన మరోసారి ఎంత సింపుల్ గా బతకొచ్చే దేశానికి ప్రేరణ ఇచ్చారని గొప్పగా వైరల్ చేసింది. దగ్గర్నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉందని కొందరు యూజర్లు చెబుతుంటే.. కొందరు ఆయన్ని లెజెండ్‌గా అభివర్ణిస్తున్నారు.
కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ శాంతాను నాయుడు నిర్వహించిన ఓ ప్రోగ్రామ్ కోసం రతన్ టాటా ఆ హోటల్‌కి వచ్చారు.
టాటా నానో చౌకైనా కారు మాత్రమేకాదు, రతన్ టాటా డ్రీమ్ కారు కూడా. మార్కెట్లోకి వచ్చిన పదేళ్లకు నానో అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. కొనేవాళ్ళు లేరు. లక్ష రుపాయిల కారున్న బ్రాండింగ్ తేడా కొట్టేసింది. అందుకే టాటా మోటార్స్ నానో ఉత్పత్తిని నిలిపివేసింది.
తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నానో కారును ఉత్పత్తి చేసేందుకు తనను ప్రేరేపించిందేంటో రతన్ టాటా చెప్పారు. స్కూటర్లపై ప్రయాణించే భారతీయ కుటుంబాలే ప్రోత్సహించాయన్నారు. చెప్పడంకాదు, తయన తరచు వాడే ఈ కారులోనే ఆయన తన డిప్యూటీ జనరల్ మేనేజర్ నిర్వహించిన మీటింగ్‌కు వచ్చారు.
ఈ వీడియోను బాలీవుడ్ సెలబ్రిటీల పిక్చర్లను తీసే ఫోటోగ్రాఫర్ వైరల్ విరాల్ భయాని షేరు చేశారు.