iDreamPost
android-app
ios-app

జాక్ పాట్ కొట్టిన భీష్మ బ్యూటీ

  • Published Feb 23, 2020 | 4:18 AM Updated Updated Feb 23, 2020 | 4:18 AM
  • Published Feb 23, 2020 | 4:18 AMUpdated Feb 23, 2020 | 4:18 AM
జాక్ పాట్ కొట్టిన భీష్మ బ్యూటీ

శాండల్ వుడ్ భామ రశ్మిక మందన్నకు గోల్డెన్ టైం నడుస్తోంది. కొత్త ఏడాది ప్రారంభమై రెండు నెలలు గడవకుండానే రెండు సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. జనవరిలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు వసూళ్ల పరంగా మహేష్ బాబు కెరీర్ బెస్ట్ గా నిలవగా తాజాగా భీష్మ నితిన్ కు అలాగే నిలవబోతోంది. సూపర్ పాజిటివ్ టాక్ తో ఇప్పట్లో దీనికి బ్రేకులు పడవని ట్రేడ్ అంచనా. యూత్ తో పాటు ఫ్యామిలీస్ కి కావాల్సిన అన్ని అంశాలు భీష్మలో ఉండటంతో బాక్స్ ఆఫీస్ టెస్ట్ ని విజయవంతంగా పూర్తి చేసినట్టే. ఇప్పుడు అందరి దృష్టి రశ్మిక మందన్న వైపే వెళ్తోంది. 
ఇప్పటిదాకా తను చేసిన సినిమాల్లో నాలుగు బ్లాక్ బస్టర్స్ ఒక యావరేజ్ ఒక డిజాస్టర్ నమోదయ్యాయి. అంటే ట్రాక్ రికార్డ్ చాలా బాగున్నట్టు. అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత విపరీతంగా ఉంది. ఇలాంటి టైంలో రశ్మిక మందన్న ఇలా వరసగా హిట్ల మీద హిట్లు కొట్టడం నిర్మాతల దృష్టి తనవైపు మళ్లేలా చేస్తోంది.  అటు పర్ఫార్మెన్స్ తో పాటు గ్లామర్, డాన్స్ విషయంలోనూ రశ్మిక హీరోలకు ధీటుగా సై అంటోంది. ఒకరకంగా చెప్పాలంటే పూజా హెగ్డే తర్వాత ఇప్పుడు తెలుగులో రశ్మికనే బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. అలా అని తనేమి అంత ఈజీగా దొరకడం లేదు. ఒకపక్క కన్నడ, తమిళ ఆఫర్లతో పాటు తెలుగులో దక్కుతున్న ఘన విజయాలు కాల్ షీట్ల డిమాండ్ ని విపరీతంగా పెంచేసాయి. 
హీరోయిన్ సెలెక్షన్ లో చాలా సెలెక్టివ్ గా ఉండే అల్లు అర్జున్, సుకుమార్ లు సైతం తమ సినిమా కోసం పూజా హెగ్డేకే ఓటు వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సుల్తాన్ తో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రశ్మిక ప్రస్తుతం కన్నడలో పొగరు అనే సినిమా చేస్తోంది. ఇవి కాకుండా ఇంకే కొత్త కమిట్మెంట్స్ ఇవ్వలేదు. బన్నీ మూవీ ఒకే చేసింది కానీ తెలుగులో ప్రస్తుతం కథలు వింటోంది. ఇప్పుడు భీష్మ ఫలితం చూశాక కచ్చితంగా ఇంకా జాగ్రత్తగా ఉంటుందనడంలో డౌట్ లేదు. గీత గోవిందంతో పాటు భీష్మ, ఛలో లాంటి సినిమాల్లో రశ్మిక క్యారెక్టర్లు ఆ సినిమాల సక్సెస్ లో బాగా హెల్ప్ అయ్యాయి. డియర్ కామ్రేడ్ ఫెయిలైనా తన యాక్టింగ్ వరకు ఎలాంటి రిమార్కు రాలేదు. సరిలేరులో మాత్రం మహేష్ మాస్ ఇమేజ్ ముందు తనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కలేదు అంతే. అయినా హిట్టు కొట్టింది. సో ఇప్పుడు రశ్మిక వరస చూస్తుంటే ఇదే ఊపులో స్టార్ రేస్ వైపు పరుగులు పెడుతూ పెద్ద హీరోల సరసన మరిన్ని ఆఫర్లు పట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Jojobet GirişDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetJojobetMadridbetMadridbetgrandpashabetgrandpashabet girişJojobetcasibomgrandpashabetjojobetcasinomilyoncasinomilyonultrabetultrabetgrandpashabet girişcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel giriş