iDreamPost
android-app
ios-app

Rashi Khanna రాశిఖన్నా డబుల్ బ్యాడ్ లక్

  • Published Jul 23, 2022 | 2:04 PM Updated Updated Jul 23, 2022 | 7:18 PM
Rashi Khanna రాశిఖన్నా డబుల్ బ్యాడ్ లక్

ఒకప్పుడు పాత సినిమాల్లో హీరో హీరోయిన్ మధ్య ముద్దు సన్నివేశం చూపించాలంటే డైరెక్టర్ వాళ్ళిద్దరి ముందు ఏ పువ్వో తెరనో అడ్డం పెట్టి పని కానిచ్చేవాడు. అంటే దానర్థం అప్పటి సభ్య సమాజం అంగీకరించదని ప్లస్ అలాంటి సీన్లకు సదరు స్టార్లు ఒప్పుకోరని. బాలీవుడ్ రాజ్ క‌పూర్ లాంటి వాళ్ళు ఈ సంప్రదాయానికి ఎదురీది బోల్డ్ సీన్స్ చూపించేవారు కానీ మిగిలినవాళ్లు మాత్రం అంత సాహసం చేయలేకపోయారు. కాలం మారింది. ఫస్ట్ లుక్ పోస్టర్స్ లోనే మూతి ముద్దులు ఘాటుగా పబ్లిసిటీ చేసి మరీ యూత్ ని లాగుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇది మాములు విషయమైపోయి జనం అంత సీరియస్ గా తీసుకోవడం లేదు.

దానికి తగ్గట్టే ఇటీవలి కాలంలో అందాల భామలు ఆన్ స్క్రీన్ రియల్ కిస్సెస్ కి అభ్యంతరం చెప్పడం లేదు. వరల్డ్ ఫేమస్ లవర్ లో విజయ్ దేవరకొండకు లిప్ లాక్ చేసిన రాశి ఖన్నా తాజాగా థాంక్ యులో నాగ చైతన్యకు రెండు మూడు సార్లు ఆధర చుంబనాలు అందించింది. అయితే సినిమా గురించిన టాక్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో ఇప్పుడీ ముద్దుల ప్రహసనం సినిమాకు ఉపయోగపడేలా కనిపించడం లేదు. పైగా తన పాత్ర ఫస్ట్ హాఫ్ లో సగం సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కే పరిమితం కావడం మరో ట్విస్టు. అసలే పక్కా కమర్షియల్ లో ఇదే నెలలో ఫ్లాప్ చవి చూసిన రాశిఖన్నాకు ఇప్పుడు మరో షాక్ తగలడం ఇబ్బందే.

అయినా కంటెంట్ బలంగా ఉండాలే కానీ ఇవి ఉన్నా లేకపోయినా చల్తా అనే వాళ్ళు లేకపోలేదు. అర్జున్ రెడ్డి నుంచి ఈ ధోరణి పెరిగిన మాట వాస్తవం. ఆ మధ్య శ్యామ్ సింగ రాయ్ లో నాని లాంటి సీనియర్ హీరోతోనూ కృతి శెట్టి లిప్ లాక్ కు మొహమాటపడలేదు. అలాంటిది రాశిఖన్నా ఎస్ చెప్పడంలో ఆశ్చర్యం లేదు. థాంక్ యు ఫైనల్ రిజల్ట్ ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది కానీ తనకో సూపర్ హిట్ దక్కుతుందని ఆశించిన రాశి ఖన్నాకు పక్కా కమర్షియల్ షాక్ తర్వాత ఇది కనీస స్థాయిలో ఆడటం చాలా అవసరం. కానీ ఆ సూచనలేమీ కనిపించడం లేదు. ఆ మధ్య అజయ్ దేవగన్ తో వెబ్ సిరీస్ డెబ్యూ చేస్తే ఆదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş