iDreamPost
android-app
ios-app

యూపీలో దారుణం.. శుభలేఖలు ఇచ్చేందుకు వెళ్లిన యువతిపై అత్యాచారం.. ఆపై విక్రయం

  • Published May 10, 2022 | 6:19 PM Updated Updated May 10, 2022 | 6:19 PM
  • Published May 10, 2022 | 6:19 PMUpdated May 10, 2022 | 6:19 PM
యూపీలో దారుణం.. శుభలేఖలు ఇచ్చేందుకు వెళ్లిన యువతిపై అత్యాచారం.. ఆపై విక్రయం

యూపీలో ఓ దారుణం వెలుగుచూసింది. తన పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్లిన 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు ముగ్గురు యువకులు. ఆపై యువతిని వేరొకరికి విక్రయించారు. ఈ దారుణ ఘటన ఝాన్సీ జిల్లాలో జరగగా స్థానికంగా ఈ వార్త కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 21వ తేదీన బాధిత యువతికి వివాహం జరగాల్సి ఉంది. 18వ తేదీన యువతి శుభలేఖలు పంచేందుకు వెళ్లగా ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. యువతిని ఒక ప్రాంతంలో ఉంచి కొన్నిరోజుల పాటు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను ఓ రాజకీయ పార్టీ నేతకు అప్పగించారు. అతను కూడా కొన్ని రోజుల పాటు యువతిని తనవద్ద ఉంచుకుని అనంతరం మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా పఠారి గ్రామంలోని మరో వ్యక్తి వద్దకు ఆమెను పంపించాడు.

అయితే బాధిత యువతి అక్కడ ఎలాగో ఒక మొబైల్ సంపాదించి.. తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. యువతి తండ్రి పోలీసులకు సమాచారం అందించగా వెంటనే స్పందించిన పోలీసులు యువతిని రక్షించారు. తనను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి ఆపై విక్రయించినట్లు బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొందని తెహరౌలి సర్కిల్ ఆఫీసర్ పేర్కొన్నారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom