iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో దారుణం – అత్త పై అల్లుడు..

హైదరాబాద్ లో దారుణం – అత్త పై అల్లుడు..

మద్యం అత్యాచారాలకు ప్రధాన కారణమని మరో మారు రుజువైంది. మద్యం మత్తులో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అత్తపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో జరిగింది. కేరళలోని పాలక్కడ్‌కు చెందిన ఓ మహిళ శ్రీనగర్‌కాలనీలో కూతురు, అల్లుడితో ఉంటోంది. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా రాత్రి పూట విధులు నిర్వహిస్తున్నారు. వారికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కూతురు, అల్లుడూ ఆఫీసుకు వెళ్తే ఆమే ఆ బాబును ఆడించేది. అయితే నవంబరు 13న విధులకు వెళ్లని అల్లుడు ఇంట్లోనే మద్యం తాగాడు.

అదే మత్తులో.. నిద్రపోతున్న అత్తపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తర్వాతి రోజు ఆమె ఏడుస్తుండగా కూతురు ప్రశ్నించింది. తల్లి జరిగిన విషయం చెప్పింది. భార్య వెంటనే బంధువులనుపిలిచి అందరి సమక్షంలో భర్తను నిలదీసింది. ‘‘తప్పైంది. దారుణం చేశాను. క్షమించండి’’ అని ఆ యువకుడు భార్యను వేడుకున్నాడు. అనంతరం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ ఇంతవరకు తిరిగిరాలేదు. దీంతో ఆ యువకుడి భార్య, అత్త శుక్రవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

jojobetjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobet güncel giriş