iDreamPost
android-app
ios-app

హీరోయిన్‌పై వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రానా దగ్గుబాటి!

  • Published Aug 16, 2023 | 9:15 AM Updated Updated Aug 16, 2023 | 9:15 AM
  • Published Aug 16, 2023 | 9:15 AMUpdated Aug 16, 2023 | 9:15 AM
హీరోయిన్‌పై వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రానా దగ్గుబాటి!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ రానా దాగ్గుబాటి .. దుల్కర్‌ సల్మాన్‌ కొత్త సినిమా ‘ కింగ్‌ ఆఫ్‌ కోత’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా ఓ హీరోయిన్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. రానా సదరు హీరోయిన్‌ పేరు చెప్పకుండా కామెంట్లు చేసినప్పటికి సోషల్‌ మీడియాలో రచ్చ మాత్రం భారీగానే జరుగుతోంది. రానా ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ను ఉద్ధేశించి ఆ మాటలు అన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రానా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాను సోనమ్‌ కపూర్‌ను ఉద్దేశించి ఆ మాటలు అనలేదని అన్నారు.

ఆయన తాజాగా స్పందిస్తూ.. ‘‘ నేను నిజంగా ఇరకాటంలో పడ్డాను. ఎందుకంటే.. నేను చేసిన వ్యాఖ్యలు సోనమ్‌ కపూర్‌ను ఉద్ధేశించన్న ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదు. నేను ఆమెను ఉద్దేశించి అనలేదు. నేను సోనమ్‌, దుల్కర్‌కు నా క్షమాపణలు చెబుతున్నా. నా వల్ల ఇద్దరికీ ఇబ్బంది కలుగుతోంది. ఈ క్లారిటీ అన్ని వివాదాలకు ఓ పులుస్టాప్‌ పెడుతుందని భావిస్తున్నాను. నన్ను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

‘కింగ్‌ ఆఫ్‌ కోత’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న రానా.. దుల్కర్‌తో ఉన్న స్నేహం గురించి మాట్లాడారు. అంతేకాదు! దుల్కర్‌ మంచి తనం గురించి చెబుతూ..‘‘ దుల్కర్‌తో ఓ సినిమా షూటింగ్‌ సమయంలో.. ఓ పెద్ద బాలీవుడ్‌ హీరోయిన్‌ తన భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంది. అది కూడా టేకుల సమయంలో. వారిద్దరూ మాట్లాడుకునేది అర్జెంట్‌ అయితే పర్లేదు. కానీ, వారిద్దరూ ఫోన్‌లోనే షాపింగ్‌ చేసుకుంటూ ఉన్నారు. దుల్కర్‌ మాత్రం ఎంతో ఓపిగ్గా ఉన్నారు. కానీ, తను మాత్రం తన డైలాగులు మర్చిపోయింది. నేను నా చేతిలో బాటిల్‌ ఉంటే క్రష్‌ చేసేవాడిని. కానీ, దుల్కర్‌ మాత్రం ఎంతో ఓపిగ్గా ఉన్నాడు’’అని అన్నాడు. ఇక, రానా ఈ మాటలు అన్నది సోనమ్‌ గురించేనంటూ ప్రచారం మొదలైంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom