iDreamPost
iDreamPost
మనకు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలకు మగ సెలెబ్రిటీలు యాంకరింగ్ చేయడం ఇప్పటిదాకా చూసాం. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో తారక్-నాని-నాగార్జున ఇలా అందరూ మేల్ యాంకర్సే ఉంటారు. కానీ దీనికి భిన్నంగా ఇప్పుడో సీనియర్ హీరోయిన్ ని ఈ పాత్రలో చూడబోతున్నాం. ఇటీవలే కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రమాదమేమీ లేదు కానీ కొంత విశ్రాంతి అవసరమని డాక్టర్లు రికమండ్ చేయడంతో ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు. ఓపక్క బిగ్ బాస్ తమిళ సీజన్ 5 మంచి పీక్స్ లో ఉంది. దాన్ని ఆపడానికి లేదు. కొనసాగించాల్సిందే. అందుకే శివగామిని తీసుకున్నారట.
చెన్నై అప్ డేట్ ప్రకారం వీకెండ్ ఎపిసోడ్స్ ని రమ్యకృష్ణ డీల్ చేయబోతున్నారు. గతంలో బిగ్ బాస్ 3 టైంలో నాగార్జునకు ఇదే తరహాలో రాలేని పరిస్థితి నెలకొన్నప్పుడు రమ్యకృష్ణనే యాంకరింగ్ చేసి మేనేజ్ చేశారు. ఇప్పుడు కమల్ కోసం అరవంలో అదే పాత్ర పోషించబోతున్నారు. కమల్ పూర్తిగా కోలుకున్నాక తిరిగి తన స్థానాన్ని తీసుకుంటారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అభిమానులు టెన్షన్ పడనక్కర్లేదు. కారణం ఏదైనా ఇలాంటి మార్పు మంచిదే. భవిష్యత్తులో మరికొందరు లేడీ ఆర్టిస్టులు ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం దక్కుతుంది. ప్రేక్షకులకూ ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ దక్కుతుంది.
తెలుగు తరహాలో తమిళంలోనూ బిగ్ బాస్ 5 మరీ అద్భుతాలు చేయడం లేదు. కాకపోతే ఇక్కడ కంటే కొంచెం బెటర్ గా ఉంది అంతే, జనంలో ఆసక్తి తగ్గిపోయిందా లేక కంటెస్టెంట్స్ సెలక్షన్, గేమ్స్ డిజైన్ లో ఏమైనా పొరపాటు జరుగుతోందా అనే కోణంలో నిర్వాహకులు విశ్లేషణ చేస్తున్నారు. ఇంత డల్ గా గత నాలుగు సీజన్లలో ఏదీ జరగలేదు. కానీ దీనికి మాత్రం స్పందన ఆశించిన స్థాయిలో లేదు. ఈ ఏడాది ఎలా ఉన్నా బిగ్ బాస్ 6కి మాత్రం ఇలాంటి ప్లానింగ్ వర్కౌట్ కాదు. ముఖ్యంగా సభ్యుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని సెలబ్రిటీ టేస్ట్ ని పెంచాలి. లేకపోతే హిందీలో లాగా లాంగ్ రన్ రాబట్టుకోవడం అసాధ్యమనే చెప్పాలి
Also Read : November Releases :థియేటర్లు ఖాళీ – టికెట్ కౌంటర్లకు జోష్ రావాలి