iDreamPost
android-app
ios-app

Bigg Boss 8 నుండి తప్పుకున్న హోస్ట్.. నెక్ట్స్ ఎవరు..?

Bigg Boss 8: స్మాల్ స్క్రీన్ పై అన్ని ఎమోషన్లతో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకుని.. సీజన్ 8 స్టార్ కాబోతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ హొస్ట్ తప్పుకోబోతున్నాడు.

Bigg Boss 8: స్మాల్ స్క్రీన్ పై అన్ని ఎమోషన్లతో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకుని.. సీజన్ 8 స్టార్ కాబోతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ హొస్ట్ తప్పుకోబోతున్నాడు.

Bigg Boss 8 నుండి తప్పుకున్న హోస్ట్..  నెక్ట్స్ ఎవరు..?

బుల్లితెరపై తిరుగులేని ఎంటర్ టైన్‌మెంట్ షోగా మారింది బిగ్ బాస్. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ప్రసారం అవుతుంది. ఇంట్లో జరిగే గొడవలు, ఫన్నీఇన్సిడెంట్, టాస్కులు, కొట్లాటలు ప్రేక్షకులు టీవీలకు కళ్లప్పగించి చూసేలా చేస్తున్నాయి. సుమారు 100 రోజుల పాటు కంటెస్టెంట్స్ ఇంట్లో ఉండి కావాల్సినంతా కంటెంట్ అందిస్తున్నారు. హిందీలో ఇప్పటికే 17 సీజన్లు పూర్తయ్యాయి. తాజాగా ఓటీటీ సీజన్ 3కూడా పూర్తయ్యింది. ఇక తెలుగులో కూడా ఏడు సీజన్లు పూర్తయ్యాయి. ఎనిమిదో సీజన్ రెడీ కాబోతుంది. వచ్చే నెలలో ఇది స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 8నుండి హోస్ట్ తప్పుకోబోతున్నాడట.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కానున్న తరుణంలో హోస్ట్ తప్పుకోబోతున్నాడట. హా కంగారు పడకండి నాగార్జున కాదులే. తమిళ బిగ్ బాస్ హోస్ట్ కమల్ హాసన్.. ఈ షో నుండి తప్పుకున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఎమోషనల్ నోట్ అందించారు. గతంలో ఇచ్చిన కమిట్ మెంట్స్ వల్ల తప్పుకుంటున్నట్లు చెప్పారు. కాగా, తమిళ బిగ్ బాస్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. తమిళంలో కూడా ఏడు సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఎనిమిదో సీజన్ కోసం రంగం సిద్ధమౌతుంది. ఈ క్రమంలో ఈ షో నుండి వైదొలిగినట్లు చెబుతున్నారు. ‘డియర్ వ్యూవర్స్, ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన మా ప్రయాణంలో చిన్న విరామం తీసుకుంటున్నాని భారమైన హృదయంతో తెలియజేయాలనుకుంటున్నాను.

మునుపటి సినిమా కమిట్స్‌మెంట్స్ కారణంగా నేను ఈ సీజన్ హోస్ట్ చేయలేకపోతున్నాను. ఈ షో ద్వారా మీ ఇంట్లోకి చేరుకోవడం గొప్ప అదృస్టం, మీరు మీ ప్రేమ, ఆపాయ్యత కురిపించారు. దీనికి ప్రతి ప్రేక్షకుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు ఇచ్చిన మద్దతులో భారతదేశంలోనే అత్యుత్తమ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ తమిళ్ నిలిచింది. ఇక్కడ నేను జీవితంలో నేర్చుకున్న పాఠాలను ఇక్కడ నిజాయితీగా పంచుకున్నాను. మీలో ప్రతి ఒక్కరికి, పోటీదారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. చివరిగా విజయ్ టీవీలోని బిగ్ బాస్ బృందానికి, అలాగే సంస్థను గొప్ప విజయాన్ని సాధించడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని ఎమోషనల్ నోట్ రాశారు. కాగా, బిగ్ బాస్ తమిళ్ 8కి కొత్త హోస్ట్ ప్రకటించలేదు యూనిట్. ప్రస్తుతం కమల్ చేతిలో ఇండియన్ 3, థగ్ లైఫ్ ఉన్నాయి. ఈ సినిమాల కారణంగా బిగ్ బాస్ నుండి తప్పుకున్నాడు లోక నాయకుడు.