iDreamPost
android-app
ios-app

అందుకే ఆయనంటే ఇష్టం లేదు.. చంద్రబాబుపై RGV సంచలన వ్యాఖ్యలు!

అందుకే ఆయనంటే ఇష్టం లేదు.. చంద్రబాబుపై RGV సంచలన వ్యాఖ్యలు!

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఇటీవల కొంతకాలం నుంచి తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఇటీవల కొంతకాలం నుంచి ఏపీ రాజకీయాల్లో ఆర్జీవీ కనిపిస్తున్నారు. తరచూ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అలా చేసినందుకే అసహ్యంగా ఉందంటూ హాట్ కామెంట్స్ చేశాడు.

చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించడం, జగన్ మోహన్ రెడ్డిపై సాఫ్ట్ కార్నర్ ఉండటం చూస్తుంటే.. ఓ పొలిటకల్ మోటో లాగా  ఉందని యంకర్ ప్రశ్నించాడు. దానికి ఆర్జీవీ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఆర్జీవీ మాట్లాడుతూ..” నాకు జగన్ అంటే ఇష్టమని, సీబీఎన్ అంటే ఇష్టం లేదని గతంలో చాలా సార్లు చెప్పాను.  అందరికి ఉన్నట్లే నాకు కొన్ని ఇష్టాలు, అయిష్టాలు అనేవి ఉంటాయి. అలానే నాకు సినీయర్ ఎన్టీఆర్ సమయం నుంచే నాకు సీబీఎన్ అంటే ఇష్టం ఉండేది కాదు. నేను ఒక్కసారిగా కూడా చంద్రబాబును కలవలేదు.  పొరపాటున వారితో కలవాల్సి వస్తే హలో మాత్రమే చెప్తాను.  వేరే వాళ్లు ఏం చేస్తున్నారు, నా గురించి ఏం అనుకుంటున్నారో నాకు అనవసరం. నేను ఎవరికి సలహాలు ఇవ్వను, వారి నుంచి తీసుకోను. అలానే నేను ఎవ్వరి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడను.

కేవలం పబ్లిక్ డోమైన్ లో వారు చేసిన వ్యాఖ్యలు, పనులపై మాత్రమే స్పందిస్తుంటాను. సీబీఎన్ మైండ్ చాలా ఫేక్ గా ఉంటుంది. నేను జగన్ ను ఓదార్పు యాత్ర సమయంలో గుర్తించాను. గతంలో ఎలా ఉన్నా.. ఆ యాత్రలో ఓ నిబద్ధత కలిగిన మనిషిలాగా జగన్ నాకు కనిపించారు.  ప్రజలపై ఆయన చూపించే లవ్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రభుత్వం చేసే పథకాల గురించి నాకు అసలు తెలియదు. కేవలం సోషల్ మీడియాలో నేను పెడుతున్న పోస్టులు చూసి.. అదేదో జగన్ కోసం వ్యూహం అని భ్రమ పడుతున్నారు. కేవలం జగన్ అంటే నాకు ఇష్టమని చెప్తున్నాను. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలోనూ, వ్యక్తిగతంగాను చెప్తాను” అంటూ ఆర్జీవీ హాట్ కామెంట్స్ చేశారు. మరి.. చంద్రబాబు, జగన్ లపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişcasibomcasibom