iDreamPost
android-app
ios-app

Ramcharan Jamesbond: రామ్‌చరణ్ నెక్ట్స్ జేమ్స్‌బాండ్? మార్వెల్ క్రియేట‌ర్ ట్వీట్‌తో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా

  • Published Jul 29, 2022 | 6:58 PM Updated Updated Jul 29, 2022 | 6:58 PM
Ramcharan Jamesbond: రామ్‌చరణ్ నెక్ట్స్ జేమ్స్‌బాండ్?  మార్వెల్ క్రియేట‌ర్ ట్వీట్‌తో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా

డేనియల్ క్రెయిగ్ జేమ్స్ బాండ్ పాత్ర‌ను పోషించ‌డం నా వ‌ల్ల‌కాద‌ని, రిటైర్ అవుతున్నట్లు ప్ర‌క‌టించాగానే నెక్ట్స్ జేమ్స్ బాండ్ ఎవ‌ర‌న్న అన్వేష‌ణ మొద‌లైంది. జేమ్స్ బాండ్ యాక్ష‌న్ హీరో మాత్ర‌మేకాదు, ఒక లెగ‌సీ, ఒక ఎమోష‌న్. అందుకే ఫ్యాన్స్ కూడా ఎవ‌రు బెట‌రో లెక్క‌లు వేస్తుంటారు. లేటెస్ట్ గా జేమ్స్‌బాండ్ పాత్రకు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ రామ్‌చరణ్ చక్కగా సరిపోతారని మార్వెల్ ‘ల్యూక్ కేజ్’ టెలివిజన్ సిరీస్ సృష్టికర్,త చియో హోదరి కోకర్ అంటున్నారు.

రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్‌చరణ్ నటన చూసిన తరువాత 007 పాత్రకు అతనే బెస్ట్ అని కోకర్ ట్వీట్ చేశారు.

తన ట్వీట్‌లో జేమ్స్‌బాండ్ పాత్రకు సూట‌య్యే హీరోల లిస్ట్ ను ఇచ్చారు. అందులో రామ్‌చరణ్ కూడా ఉన్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఇంకో ట్వీట్ కూడా చేశారు. ఆ లిస్ట్ లో వాళ్ల‌ను ఎందుకు సెల‌క్ట్ చేసుకొన్నారో ఆయ‌న‌ చెప్పారు.


“బాండ్ పాత్రకు పోటీలో ఇడ్రిస్ ఎల్బా ఎలా స‌రిపోతారో అందరికీ తెలిసిందే. కానీ, ‘గ్యాంగ్స్ ఆఫ్ లండన్’లో నటించిన సోపె డిరిసు, ‘ద ఆఫర్’ నటుడు మాథ్యూ జి, ‘స్నోఫాల్’ సిరీస్‌తో ఆకట్టుకున్న డామ్సన్ ఇడ్రిస్, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని రామ్‌చరణ్, జేమ్స్‌బాండ్‌ సూట్ వేసుకుని ‘వాల్థర్ పిపికె’ పిస్టల్‌తో కెమేరా ముందు యాక్షన్ చేయడానికి బాగా సూట్ అవుతారని నాకనిపిస్తోంది” అని తన రెండో ట్వీట్‌లో వివ‌రాలిచ్చాడు.

చియో హోదరి కోకర్ ‘ల్యూక్ కేజ్’ సిరీస్‌కు ముందు ‘ఎన్‌సిఐఎస్: లాస్ ఏంజెలిస్, ఆల్మోస్ట్ హ్యూమన్ టీవీ చిత్రాల సృష్టిక‌ర్త‌గా పాపులర్ అయ్యారు. అందుకే ఆయన రామ్‌చరణ్ మీద చేసిన ట్వీట్ వైరల్ అయిపోయింది. జేమ్స్ బాండ్ గా రామ్ చ‌ర‌ణ్ అన్న ఫీలింగే ఆయ‌న ఫ్యాన్స్ కి బాగా న‌చ్చింది. కొంద‌రు కింగ్ ఆఫ్ టాలీవుడ్ గా బిరుదు ఇచ్చేశారు. మ‌రికొంద‌రు చరణ్‌ను బాండ్‌గా చూపిస్తూ ఫ్యాన్-పోస్టర్స్ తయారు చేసి షేర్ చేశారు. ఇవ‌న్నీ ట్రెండ్ అవుతున్నాయి.


ఇక చరణ్​ శంకర్ దర్శకత్వంలో ‘ఆర్​సీ 15’ చేస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్​లో భారీ అంచనాలు ఉన్నాయి. చరణ్‌ మూడు భిన్న గెటప్​లలో కనిపించనున్నారన్న‌ది స‌మాచారం. అందులో ఒకటి ఐఏఎస్‌ అధికారి పాత్ర‌. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్‌, అంజలి కీలకపాత్రల్లో న‌టిస్తున్నారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis