iDreamPost
android-app
ios-app

తాతైన విలక్షణ దర్శకుడు

  • Published Feb 10, 2020 | 8:24 AM Updated Updated Feb 10, 2020 | 8:24 AM
  • Published Feb 10, 2020 | 8:24 AMUpdated Feb 10, 2020 | 8:24 AM
తాతైన విలక్షణ దర్శకుడు

శివతో తెలుగు సినిమా గమనాన్ని మార్చిన రామ్ గోపాల్ వర్మకు కొత్త ట్యాగ్ వచ్చేసింది. అదే తాతయ్యగా. ఆయన కూతురు రేవతి వర్మ నిన్న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2013లో ప్రణబ్ అనే డాక్టర్ ని వివాహం చేసుకున్న రేవతికి ఇదే మొదటి సంతానం. ఏడేళ్ల తర్వాత కలిగిన నలుసు కావడంతో ఆ ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇంకా ట్విట్టర్ లో వర్మ రియాక్షన్ కనిపించలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ తన కూతురు అల్లుడు చాలా సంతోషంగా ఉంటూ బోర్ కొట్టిస్తున్నారని అప్పుడప్పుడు గొడవలు ఉంటె బాగుండేదని చెప్పడం ద్వారా చిన్న షాక్ ఇచ్చారు.

మీడియాకు వచ్చేందుకు ఇష్టపడని రేవతి చాలా ఏళ్లుగా ముంబైలోనే ఉంటున్నారు. వర్మకు రేవతి ఒకేఒక్క కూతురు. పలు సందర్భాల్లో తన గురించి మాట్లాడిన వర్మ ఇటీవలి కాలంలో తన ప్రస్తావన తీసుకురాలేదు. ఈ తాతయ్య ప్రమోషన్ సంగతి కాసేపలా ఉంచితే జయాపజయాలతో సంబంధం లేకుండా వర్మ సినిమాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. వివాదాలు ఎన్ని వస్తున్నా దానికి తగ్గట్టు మాత్రం సినిమాలు కలెక్షన్లు సాధించలేకపోతున్నాయి.

ఇటీవలే తీసిన బ్యూటిఫుల్ ప్రేక్షకుల దృష్టికి వచ్చే లోపే వెళ్లిపోయింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ విడుదల ఇంకా ఖరారు కాలేదు. మరోవైపు దిశ సంఘటనను ఆధారంగా సినిమా చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన వర్మ అల్రెడీ ఆ పనులు మొదలుపెట్టేశారు. ఇప్పుడీ తాతయ్య పదవి గురించి ఏమని ట్వీట్ చేస్తాడోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetasyabahis girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio