iDreamPost
android-app
ios-app

RC 15లో క్రేజీ అట్రాక్షన్స్

  • Published Oct 26, 2021 | 10:21 AM Updated Updated Oct 26, 2021 | 10:21 AM
RC 15లో క్రేజీ అట్రాక్షన్స్

ఇండియన్ స్పిల్ బర్గ్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పూణేలో జరుగుతోంది. కియారా అద్వానీతో హీరో కాంబోలో షూట్ చేస్తున్న సాంగ్ ని 12 రోజుల పాటు చిత్రీకరించనున్నారు. ఇప్పటిదాకా ఏ పాటకు జరగనంత బడ్జెట్ ని దీనికి కేటాయించారట. అది పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాక చరణ్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ పాల్గొనబోతున్నారు. రాబోయే రోజుల్లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం ప్రత్యేకంగా ఇండియా వైడ్ టూర్ ప్లాన్ చేసిన నేపథ్యంలో సినిమాకు దానికి బ్యాలన్స్ చేసేలా చెర్రీ డేట్స్ ని ఫిక్స్ చేయబోతున్నారట.

మరో లేటెస్ట్ కిక్కిచ్చే అప్ డేట్ ప్రకారం ఇందులో విలన్ గా మలయాళం నటుడు సురేష్ గోపి పేరు పరిశీలనలో ఉందని సమాచారం. గతంలో విక్రమ్ శంకర్ కాంబోలో వచ్చిన ఐలో ప్రతినాయకుడిగా నటించిన ఈ వర్సటైల్ యాక్టర్ ఆ క్యారెక్టర్ లో ఎంతగా మెప్పించారో అందరికీ గుర్తే. అందుకే ఇప్పుడు ఈ పొలిటికల్ థ్రిల్లర్ కోసం కూడా ఆయన్నే సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి జెనరేషన్ కి సురేష్ గోపి అంతగా ఐడియా ఉండకపోవచ్చు కానీ 90 దశకంలో పోలీస్ కమీషనర్, మాఫియా, జర్నలిస్ట్ లాంటి డబ్బింగ్ సినిమాల ద్వారా ఇక్కడా మంచి ఫాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. తర్వాత ఇక్కడ మార్కెట్ తగ్గింది.

2023 సంక్రాంతికి విడుదల ప్లాన్ చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో జయరాం, సునీల్, అంజలి లాంటి తారాగణం భారీగా ఉంది. తమన్ స్వరపరిచిన పాటలు కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయని ఇన్ సైడ్ టాక్. వచ్చే ఏడాది చరణ్ వి రెండు సినిమాలు రిలీజవుతాయి. అవి కూడా కేవలం నెల రోజుల గ్యాప్ లో. జనవరి 7న ఆర్ఆర్ఆర్ ఫిబ్రవరి 4న ఆచార్యలు మెగా ఫ్యాన్స్ కు కనువిందు చేయబోతున్నాయి. కెరీర్ లో మొదటిసారి చరణ్ కు ఇలా జరగడం. ఆ తర్వాత 10 నెలల గ్యాప్ తప్పదు. సుమారు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో శంకర్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోందని ట్రేడ్ టాక్. అంచనాలు కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి.

ALSO READ – క్రియేటివ్ దర్శకుడికి పెద్ద సవాలే