iDreamPost
android-app
ios-app

తన ఫేవరేట్ ఫుడ్ ఏంటో చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్..

  • Published Jun 19, 2022 | 5:25 PM Updated Updated Jun 19, 2022 | 5:25 PM
  • Published Jun 19, 2022 | 5:25 PMUpdated Jun 19, 2022 | 5:25 PM
తన ఫేవరేట్ ఫుడ్ ఏంటో చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్..

తెలుగులో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడ వరుసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం రకుల్ చేతిలో దాదాపు అరడజను బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఇటీవలే కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు కూడా ప్రకటించింది.

దాదాపు 12 సంవత్సరాలుగా కెరీర్ సాగిస్తున్న రకుల్ ఇప్పటికి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉందంటే కారణం ఇంకా అందంగా ఉంటూ ఫిట్నెస్ మెయింటైన్ చేయడమే. తన అందానికి, ఫిట్నెస్ కి కారణం ఏంటో మాత్రం చెప్పదు రకుల్. అయితే ఇటీవల బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్ తన ఫేవరేట్ ఫుడ్ గురించి మాట్లాడింది.

ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ”ఆహారంలో నాకు ఎలాంటి నియమాలేవీ లేవు. నాకు నచ్చిన ఆహారం కడుపునిండా తింటాను. కాకపోతే జ్యూస్‌ కంటే కూడా నేను పండ్లు తినడానికే ఆసక్తి చూపిస్తాను. అలా అయితేనే వాటిలోని పోషకాలు మనకు పూర్తిగా అందుతాయి. అలాగే గుజరాతీ థాలీ, గులాబ్‌ జామూన్‌, ఆలూ పరాటాలు చాలా ఇష్టంగా తింటాను. రెస్టారెంట్లు, స్టార్‌ హోటల్స్‌ అంటూ బయట ఫుడ్ అస్సలు తినను. ఇంట్లో ఫుడ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను” అని తన ఫేవరేట్ ఫుడ్ గురించి తెలిపింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom