పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. మణిపూర్ అల్లర్లపై ఉభయ సభలు అట్టుడికి పోతున్నాయి. మణిపూర్ అంశంపై ప్రధాని మాట్లాడాలని ప్రతిపక్షాలు పట్టుబడితే.. అధికార పక్షం కూడా అదే స్థాయిలో మొండి వైఖరిని అవలంభిస్తోంది. దీంతో ఉభయ సభలో గందర గోళం కొనసాగుతోంది. ఇలా వేడి వేడిగా సాగుతున్న సమావేశాల్లో గురువారం రాజ్యసభలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. రాజ్యసభ ఛైర్మన్ కాసేపు సభలో నవ్వులు పూయించారు. మీకు కోపం వస్తుందని ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే అన్నగా.. నాకు పెళ్లైంది..కోపం రాదని సరదగా అంటూ నవ్వుపు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మణిపూర్ హింసతో పార్లమెంట్ అట్టుడుకుతుంది. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడుతూ.. వచ్చాయి. ఇలా మంచి వాడీ వేడీగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో గురువారం సరదా సన్నివేశం జరిగింది. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖండ్ , ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. గురువారం రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… 267 నిబందనకు ప్రాధాన్యం ఇస్తూ మణిపూర్ సమస్యపై చర్చను చేపట్టాలని, ఇతర సభఆ కార్యకలాపాలను వాయిదా వేయాలని కోరారు.
“ఈ డిమాండ్ ను అంగీకరించాలంటే ఏదో ఓ కారణం ఉండాలని మీరు చెప్పారు. నేను మీకు కారణాన్ని చూపించాను. బుధవారం కూడా ఇదే విషయంపై విజ్ఞప్తి చేశాను. కానీ మీరు కోపంగా ఉండి ఉంటారు” అని ఖర్గే అన్నారు. అయితే ప్రతిపక్షనేత మాటలపై ఛైర్మన్ స్పందిస్తూ..”నాకు పెళ్లై 45 ఏళ్లు దాటింది. నాకు ఎప్పుడూ కోపం రాదు. నమ్మండి” అంటూ సరదాగా అన్నారు. దీంతో సభలోని సభ్యులంతా గొల్లుమని నవ్వారు. అనంతరం కాంగ్రెసే సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని ఉద్దేశిస్తూ కూడా ధన్ కర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.
“చిదంబరం గొప్ప సీనియర్ న్యాయవాది అనే విషం అందరికీ తెలుసు. ఓ సీనియర్ న్యాయవాదిగా కోపం ప్రదర్శించే అధికారం మనకు లేదు. మీరొక అధికారి(ఖర్గేను ఉద్దేశిస్తూ), ఈ వ్యాఖ్యలను దయచేసి సవరించండి” అని కోరారు. దీనిపై మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. మీకు కోపం రాదు, మీరు కోపాన్ని ప్రదర్శించరు కానీ లోలోపల కోపంగా ఉండారని అన్నారు. దీంతో మరోసారి సభలోని సభ్యులు నవ్వరు. ఇలా గురువారం రాజ్యసభలో సరద వాతావరణం కనిపించింది. ఈ సరద సన్నివేశంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“मैं 45 साल से शादीशुदा आदमी हूं, इसलिए मैं गुस्सा नहीं करता हूं”
◆ मल्लिकार्जुन खड़गे से बोले सभापति जगदीप धनखड़, राज्यसभा में लगे हंसी के ठहाके@kharge
| #MallikarjunKharge | Jagdeep Dhankhar | #JagdeepDhankhar pic.twitter.com/8o39PY69p9
— Amit Singh 🇮🇳 (@KR_AMIT007) August 3, 2023
ఇదీ చదవండి: లోక్ సభ జరుగుతున్న తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆవేదన!