Arjun Suravaram
Arjun Suravaram
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజకీయాల్లో రాహుల్ పై అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఆయన చేపటిన భారత్ జోడో యాత్రతో రాహుల్.. విమర్శకుల ధీటైన సమాధానం ఇచ్చారు. ఈ యాత్ర ద్వారా రాహుల్ పూర్తిగా మారిపోయారు. నిరంతరం ప్రజలతో మమేకమతు.. వారి సమస్యలు తెలుసుకుంటున్నాడు. అలా కేవలం కొన్ని రోజులే కాక నిరంతరం ప్రజలతో కలిసి ముచ్చటించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా… ఇటీవలే డెలివరీబాయ్ బండి ఎక్కారు. బస్సులో ప్రయాణం చేస్తూ మహిలతో ముచ్చటించారు. అలానే లారీలో ప్రయాణం చేసి.. డ్రైవర్ల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. తాజాగా మరోసారి ట్రక్కులో ప్రయాణం చేసి.. అందరిని ఆశ్యర్యానికి గురి చేశారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. యూఎస్ఏ లో ఆయన పర్యటన బిజీబిజీగా సాగుతోంది. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు 310 కిలోమీటర్ల పాటు ట్రక్కులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో భాగంగా డ్రైవర్‌తో రాహుల్ గాంధీ ముచ్చటించారు. దానికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రాహుల్ గాంధీ ఈ ట్రక్కు ప్రయాణ సమయంలో పాటలు వింటూ ఎంజాయ్ చేశారు. ఇటీవలే హత్యకు గురైన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాల 295 పాటను అడిగి మరీ.. ప్లే చేయించుకున్నారు.
దాదాపు 310 కిలోమీటర్లు రాహుల్ గాంధీ.. ట్రక్కు డ్రైవర్లతో ప్రయాణం చేశారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడి డ్రైవర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. తల్జిందర్ సింగ్ అనే వ్యక్తి ట్రక్కులో రాహుల్ ప్రయాణించారు. అలానే పర్యటనలో ట్రక్కును ఓ రెస్టారెంట్ వద్ద ఆపారు. అక్కడ మరికొందరు డ్రైవర్లతో రాహుల్ ముచ్చటించారు. ఈ మొత్తం ట్రక్కు ప్రయాణానికి సంబంధించిన వీడియోను.. రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. రాహుల్ గాంధీ ట్రక్కు ప్రయాణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“कितना कमा लेते हो?”
“कुछ गाने बजा लें? सिद्धू मूसेवाला के?”
“हम ट्रक वालों के कारण ही मैन्युफैक्चरर्स का काम चलता है।”
अमेरिका में एक भारतीय ड्राइवर के साथ ट्रक यात्रा, उनके अनुभव और कहानियां!
पूरा वीडियो यूट्यूब पर:https://t.co/AxWYEHoka7 pic.twitter.com/KQ8OJq8Vrg
— Rahul Gandhi (@RahulGandhi) June 13, 2023