iDreamPost
iDreamPost
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు రంగులు వేయటానికి 1300 కోట్లు ఖర్చు పెట్టింది అంటున్న లోకేష్ గారి ఆరోపణ పై పలువురి అభిప్రాయం కోరగా ఈ విధంగా స్పందించారు .
ఏమి చదువుకున్నాడు ఈయన ఒక వర్క్ ఇన్స్పెక్టర్ మాత్రపు పరిజ్ఞానం కూడా లేకుండా పంచాయితీ రాజ్ వంటి కీలక శాఖ కి మంత్రిగా ఎలా చేసాడు అని ఒక హౌసింగ్ బోర్డ్ ఇంజనీర్ ప్రశ్న .
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు 11158 . 1300 కోట్ల నిధులతో ఈ సచివాలయాలకు రంగులు వేశారంటే ఒక్కో సచివాలయానికి 11,65,000 (పదకొండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు) వెచ్చించి రంగులు వేయాల్సి ఉంటుంది . ఆ మాత్రపు కనీస అంచనా లేకుండా భాధ్యతాయుత స్థానంలో ఉండేవారు ఎలా ఆరోపణ చేస్తారు . వినే జనం వెర్రివాళ్ళు అనుకొంటున్నాడా లోకేష్ గారు అని ఓ గృహిణి వ్యాఖ్యానించారు .
గత ఇరవై ఏళ్లుగా క్లాస్ 1 కాంట్రాక్టర్గా అనుభవం ఉన్న క్రాంతి అనే వ్యక్తి ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి .
– 1300 కోట్లు పెయింట్స్ కి ఖర్చు చేయమన్న జీవో ఏదైనా రిలీజ్ చేసిందా రాష్ట్ర ప్రభుత్వం ? .
– 1300 కోట్ల అంచనాలతో ఎస్టిమేట్స్ ఎవరు రూపొందించారో సాక్ష్యం ఉందా ? .
– ఆ అంచనాలకు సాంకేతిక ఆమోదం లభించిందా ? .
– సదరు విలువ గల పనికి టెండర్స్ ఏ తారీఖున పిలిచారు ?
– ఆ పని దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎవరు ?.
– వర్క్ పూర్తయిన మేజర్మెంట్స్ రికార్డ్స్ ఎవరు చేశారు?.
– వాటిని ఆమోదించి చెల్లింపులు జరిపింది ఎవరు?.
– 1300 కోట్లు చెల్లించిన పేస్లిప్స్ ఏమైనా ఉన్నాయా?.
– మళ్లీ ఆ భవనాలకు తిరిగి పెయింట్స్ వేయడానికి ఇంకో 1300 కోట్లు వెరసి 2600 కోట్లు ప్రజాధనాన్ని మింగేస్తున్నారు అనటానికి మీ దగ్గరున్న సాక్ష్యం ఏమిటీ ? .
– ఇలా మిడిమిడి జ్ఞానంతో అసంబద్ధ ఆరోపణలు చేసే లోకేష్ కి ఎమ్మెల్సీ పదవి , మంత్రి పదవి ఎలా ఇచ్చారో అర్థం కావట్లేదు . కేవలం బాబు కొడుకు కావటం వలనా ?.
– విషయ పరిజ్ఞానం లేని ఇలాంటి జ్ఞానసూన్యుల్ని కోట్ల ఖర్చుతో భరాయిస్తున్న మండలిని ఎందుకు రద్దు చేయకూడదు ?.
పై ప్రశ్నలకు లోకేష్ గారు ఏ విధమైన సమాధానం చెప్తారో వేచి చూడాలి .