‘బలగం’ సినిమా గురించి ప్రత్యేకం తెలుగు ప్రేక్షకులకు చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా విడుదలై.. ఘన విజయం అందుకుని టాలీవుడ్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం దక్కించుకుంది. 2023 మార్చి3 వ తేదీన ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అద్భుత విజయం సొంతం చేసుకుంది. అలానే పలు రికార్డులను బలంగా మూవీ తిరగరాసింది. అంతేకా అంతర్జాతీయ స్థాయిలో వివిధ అవార్డులను బలగం సినిమా కైవసం చేసుకుంది. ఇంకా ఈ సినిమా స్థాయిలో ఏ రేంజ్ లోకి వెళ్లిందంటే.. ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేసే పరీక్షల్లో కూడా ఈ సినిమాపై ప్రశ్నలు అడిగారు. తాజాగా శనివారం జరిగిన గ్రూప్-4 పరీక్షల్లో ఈ సినిమాపై ఓ ప్రశ్న అడిగారు.
జబర్దస్త్ వేణు.. దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం బలగం. ఈ సినిమా ద్వార దర్శకుడిగా మారడమే కాకుండ సాలీడ్ హిట్ కొట్టాడు. హీరో, హీరోయిన్ తప్ప మిగతా అందరూ కొత్త వారిని తీసుకుని.. తెలంగాణలోని ఓ సంప్రదాయాన్ని ఆధారంగా బలగం మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా జనాలకు ఎంతలా కనెక్ట్ అయ్యిందంటే.. ఊర్లలో.. ప్రత్యేక షోలు వేసుకుని మరీ. ఊరంతా ఒక్క చోట చేరి.. సినిమాను చూశారు. బలగం సినిమా చూసి.. దూరమైన బంధాలు ఎన్నో చేరువయ్యాయి. ఇక తాజాగా బలగం సినిమా మరో సారి వార్తల్లో నిలిచింది. అదేంటంటే. శనివారం జరిగిన గ్రూప్-4 పరీక్షల్లో బలగం సినిమాపై ప్రశ్న అడిగారు. టీఎస్పీస్సీ నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలోని పేపర్-1 జనరల్ స్టడీస్ లో ఆ ప్రశ్న అడిగారు.
ఆ ప్రశ్న ఏమిటంటే.. బలగం చిత్రానికి సంబంధించి కింది జతలలో ఏవి సరిగ్గా జతపరిచినవి? అని అడిగారు. ఎ. దర్శకుడు-వేణు యెల్దండి, బి. నిర్మాత- దిల్ రాజు, హన్షితా రెడ్డి, హర్షిత్ రెడ్డి, సి.సంగీత దర్శకుడు- భీమ్స్ సిసిరోలియో, డి. కొమరయ్య పాత్రను పోషించినవారు- అరుసం మధుసూధన్. దీనికి సమాధానం ఏ, బీ, సీ కాగా బలగం సినిమాలో కొమరయ్య పాత్రను ప్రభుత్వ ఉపాధ్యాయుడు కేతిరి సుధాకర్ రెడ్డి పోషించారు. బలగం సినిమాపై ప్రశ్నలు అడగటం..ఇది తొలిసారి కాదు.. ఈ ఏడాది జరిగిన పోలీసు కానిస్టేబుల్ పరీక్షలోనూ అడిగారు. ఆ పరీక్షల్లో ‘మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో బలగం సినిమాకు ఏ విభాగంలో పురస్కారం లభించింది?’ అనే ప్రశ్న అడిగారు. మరి.. ఇలా బలగం మూవీ గురించి పరీక్షల్లో ప్రశ్నలు అడగటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.