iDreamPost
iDreamPost
నిన్న బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల యుద్ధం కొనసాగింది. కార్తికేయ రాజా విక్రమార్కతో పాటు ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం బరిలో దిగింది. రెండింటి మీద భారీ అంచనాలు లేవు కానీ పబ్లిసిటీ ద్వారా వీలైనంత హైప్ తెచ్చేందుకు రెండు టీమ్ లు గట్టిగానే కృషి చేశాయి. అయితే విజయ్ దేవరకొండ స్వయంగా రంగంలోకి దిగడంతో తమ్ముడి మూవీకి కాస్త ఎక్కువ బజ్ వచ్చిన మాట వాస్తవం. అలా అని భీభత్సమైన ఓపెనింగ్స్ దక్కలేదు కానీ ఉన్నంతలో హీరో ఇమేజ్ కి మించే డీసెంట్ వసూళ్లు దక్కాయి. మరి ప్రేక్షకులు ట్రైలర్ చూసి ఆశించినట్టుగా పుష్పక విమానం గాల్లో తేలేలా చేసిందా లేక దభాలున కింద పడేసిందా రిపోర్ట్ లో ఓ లుక్ వేద్దాం
గవర్నమెంట్ టీచర్ గా పనిచేసే సుందర్(ఆనంద్ దేవరకొండ)కి మీనాక్షి(గీతా సైని)తో పెళ్లవుతుంది. కానీ వాళ్ళ మధ్య అండర్ స్టాడింగ్ ఉండదు. ఓ రోజు చెప్పాపెట్టకుండా మీనాక్షి మాయమైపోతుంది. తన పెళ్ళాం లేచిపోయిందని చెబితే పరువు పోతుందని భావించిన సుందర్ తన స్థానంలో షార్ట్ ఫిలింస్ లో నటించే రేఖ(శాన్విమేఘన)ను భార్యగా అందరికీ పరిచయం చేస్తాడు. ఈ లోగా మీనాక్షికి సంబంధించిన ఒక షాకింగ్ నిజం బయటికి వస్తుంది. పోలీసులు రంగప్రవేశం చేస్తారు. తన ప్రమేయం లేకుండానే సుందర్ పెద్ద చిక్కులో ఇరుక్కుంటాడు. మరి అతను ఎలా బయట పడ్డాడనేది తెరమీద చూసి ధరించాలి తప్ప ఇక్కడ చెప్పకూడదు
ప్రమోషన్ స్టేజి నుంచి దీన్నో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా చెప్పుకొచ్చిన దర్శకుడు దామోదర దానికి భిన్నంగా సెకండ్ హాఫ్ మొత్తం క్రైమ్ థ్రిల్లర్ తరహాలో నడిపించే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఫస్ట్ హాఫ్ ఓ మోస్తరుగా నడిచినా రెండో సగంలో మాత్రం పూర్తిగా చేతులెత్తేశాడు. ఆనంద్ సబ్జెక్టు సెలక్షన్ విభిన్నంగా ఉన్నప్పటికీ ఎక్స్ ప్రెషన్స్ పరంగా చేయాల్సిన హోమ్ వర్క్ చాలా ఉంది. హీరోయిన్లు ఇద్దరూ బాగున్నారు. కాగితం మీద బాగా అనిపించిన ట్విస్ట్ స్క్రీన్ మీద మాత్రం గ్రిప్పింగ్ గా నడవలేకపోయింది. దీంతో ఏదో ఊహించుకుని పుష్పక విమానం ఎక్కితే పంచరైన బస్సులో నుంచి బలవంతంగా దిగాల్సి వచ్చిన ప్యాసెంజర్ లా మిగిలారు ప్రేక్షకులు
Also Read : Drushyam 2 : సురేష్ బాబు బిజినెస్ లెక్కలు వేరే