iDreamPost
android-app
ios-app

Puspa పుష్ప2లో పోలీస్ ఆఫీస‌ర్ గా విజ‌య్ సేతుప‌తి

  • Published Jun 28, 2022 | 1:00 PM Updated Updated Jun 28, 2022 | 1:00 PM
  • Published Jun 28, 2022 | 1:00 PMUpdated Jun 28, 2022 | 1:00 PM
Puspa పుష్ప2లో పోలీస్ ఆఫీస‌ర్ గా విజ‌య్ సేతుప‌తి

నేటీవిటీ, యూనివ‌ర్స‌ల్ ప్లాట్‌తో పుష్ప ఇండియాలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. చాలా చోట్ల క‌ల్ట్ స్టేట‌స్ వ‌చ్చింది. పుష్ప‌కు సీక్వెల్ కోసం అప్పుడే బ‌జ్ మొద‌లైపోయింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న లు పాన్ ఇండియ‌న్ స్టార్ లు అయితే, సుకుమార్ రేంజ్ మ‌రో మెట్టుపెరిగింది. పుష్ప: ది రూల్ కోసం ఫ్యాన్స్ అల్లల్లాడిపోతున్నారు. ఏంటీ పుష్ప సీక్వెల్ స్పెష‌ల్? బన్వర్ సింగ్ షెకావత్ పుష్ప‌ల మ‌ధ్య‌ ముఖాముఖి పోరాటం ఉంటుందన్న‌ది ఇన్ సైడ్ టాక్.

సుకుమార్ టీం పుష్ప: ది రూల్ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో బిజీ. సెప్టెంబర్ 2022లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. పుష్ప క‌న్నా, దాని సీక్వెల్ లో పాత్రల మీద ఎక్కువ‌గా వ‌ర్క్ చేస్తున్నారు. నిజానికి, పుష్ప ఫ‌స్ట్ పార్టీలో విల‌న్ గా విజ‌య్ సేతుప‌తు న‌టించాల్సి ఉన్నా, ఆయ‌న త‌ప్పుకున్నారు. విక్ర‌మ్ సినిమాలో సేతుప‌తి యాక్టింగ్ కి ఆల్ ఇండియా లెవెల్ లో పేరు వ‌చ్చింది. అందుకే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని కీల‌క పాత్ర‌కోసం తీసుకోవాల‌ని పుష్ప నిర్మాత‌లు ట్రైచేస్తున్నారు.

ఈ వార్త కనుక నిజ‌మైతే, అల్లు అర్జున్, విజయ్ సేతుపతి , ఫహద్ ఫాసిల్ ఫ్యాన్స్ కు ఊపు వ‌చ్చిన‌ట్లే. పుష్ప2 లో సౌత్ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి, సీనియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇది అదిరిపోతుందంట‌. అఫీషియ‌ల్ గా తెలియాల్సి ఉంది.

పుష్ప 2లో రష్మిక మందన్న, అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, జగదీష్, అజయ్, అజయ్ ఘోష్, రావు రమేష్, సునీల్, అనసూయలు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss