iDreamPost
android-app
ios-app

పుష్ప సినిమా సమంత వల్లే హిట్ అయింది

  • Published May 26, 2022 | 7:30 AM Updated Updated May 26, 2022 | 7:30 AM
  • Published May 26, 2022 | 7:30 AMUpdated May 26, 2022 | 7:30 AM
పుష్ప సినిమా సమంత వల్లే హిట్ అయింది

గత డిసెంబర్ లో రిలీజైన పుష్ప సినిమా దేశమంతటా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ విజయంపై పలువురు సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేశారు. తాజాగా ప్రముఖ నటుడు, సీనియర్‌ హీరో భానుచందర్‌ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా, ఆ ఇంటర్వ్యూలో పుష్ప సినిమా గురించి మాట్లాడాడు.

ఇంటర్వ్యూలో యాంకర్ కొన్ని రోజులుగా టాలీవుడ్ బాలీవుడ్ ని డామినేట్ చేస్తుంది అంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడగగా.. భానుచందర్ మాట్లాడుతూ.. అవును, ఇటీవల వచ్చిన చాలా సినిమాలు భారీ విజయం సాధించాయి. బాలీవుడ్ లో కూడా పెద్ద హిట్ అయ్యాయి. ఇది మంచి పరిణామం. ఇటీవల రిలీజ్‌ అయిన పుష్ప సినిమా కూడా ఇక్కడా, బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా అయితే ఒక్క ఊ అంటావా మావ.. ఊఊ ఉంటావా పాట వల్లే హిట్ అయింది. నిజం చెప్పాలంటే సమంత వల్లే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయింది. సమంత చేసిన ఈ స్పెషల్ సాంగ్ తెలుగుతో పాటు తమిళం, మాళయాళం, హిందీలో కూడా బాగా ఫేమస్ అయింది. ఈ పాట ఫేమస్ అవ్వడంతో జనాలు సినిమాకి కూడా వచ్చారు అని అన్నారు.

మరి సమంత వల్లే పుష్ప సినిమా హిట్ అయింది, ఆ ఒక్క పాట వల్లే హిట్ అయింది అనడాన్ని అల్లు అర్జున్ అభిమానులు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabet