iDreamPost
android-app
ios-app

బీసీల పట్ల టీడీపీది కపట ప్రేమేనా?

  • Published Dec 09, 2022 | 10:24 PM Updated Updated Dec 10, 2022 | 6:49 PM
బీసీల పట్ల టీడీపీది కపట ప్రేమేనా?

వైసీపీ జయహో బీసీ సభ తలపెట్టిన నాటి నుండి 2019 లో టీడీపీకి దూరమైన బీసీలు ఈ సభతో మరింత దూరమవుతారని భయపడ్డ బాబు అండ్ కో తమ చెప్పుచేతల్లోని ఎల్లో మీడియా సహాయంతో వైసీపీ వ్యతిరేక పార్టీ, బీసీ ద్రోహుల పార్టీ, బీసీలకు అన్యాయం చేసిన పార్టీ అంటూ క్షణం తెరిపి లేకుండా మూడు రోజుల పాటు దుస్ప్రచారం చేసాయి .

బీసీ ప్రజలకు, నాయకులకు ఏ ప్రభుత్వం హయాంలో ఎంతమందికి ప్రతినిధ్య‌మిచ్చారు? ప్రజలకు ఎంత మేలు చేశారు అన్న‌ది లెక్కలు తీస్తే టీడీపీ ప్రచారంలోని డొల్లతనం, బీసీ ప్రజల సంక్షేమం, అభ్యున్నతి పట్ల టీడీపీ నిర్లక్ష్యం కళ్ళకి కట్టినట్టు కనపడతాయి.

బీసీ సబ్ ప్లాన్ కు ప్రతి ఏడాది 10 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో 20 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. బీసీ సబ్ ప్లాన్ కు ఏటా 15 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో 75 వేల కోట్లు ఇస్తామని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. కానీ ఈ మూడున్నరేళ్లలో కేవలం డీబీటీ ద్వారా బిసిలకు 86 వేల కోట్లు ఇచ్చారు. డీబీటీ ,నాన్ డీబీటీ కోటాలు కలిపి 1.63 లక్షల కోట్ల రూపాయల మేర బీసీలకు లబ్ది చేకూర్చింది వైసీపీ ప్రభుత్వం..

బీసీల పై టీడీపీ నైజనికి నిదర్శనంగా 2019 ఎన్నికల తర్వాత వరదల సమయంలో టీడీపీ రూపొందించిన వీడియోని చెప్పుకోవచ్చు. నాటి ఎన్నికలకు ముందు టీడీపీ ప్రచారానికి రూపొందించిన పలు వీడియోల్లో నటించిన శేఖర్ చౌదరి అనే ఆర్టిస్ట్ ని రైతుగా చూపిస్తూ ఎన్నికల తర్వాత వరదల సందర్భంగా వైసీపీని విమర్శిస్తూ, అసత్య సమాచారంతో ఒక వీడియో రూపొందించారు. సదరు శేఖర్ చౌదరి ఆ వీడియోలో నాటి ఇరిగేషన్ మంత్రి, బిసి నేత అయిన అనిల్ కుమార్ యాదవ్ ని బర్రెలు, గొర్రెలు కాచుకొనే వాణ్ని మంత్రిని చేశారు. ఆ అనిల్ కుమార్ యాదవ్ గాడికి ఏమి తెలుసంటూ కులం పేరుతో దూషించిన ఆ వీడియో పై కేసు నమోదై, విచారణలో ఆ వీడియో టీడీపీ తయారు చేయించింది అని తేలింది.

అంతే కాదు ఒక మంత్రిని, బీసీ నాయకుణ్ణి తిట్టిన ఆ వీడియోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఇతర నాయకులతో పాటు, టీడీపీ ఆఫీషియల్ పేజీల్లో కూడా షేర్ చేసి బీసీల పట్ల తమ నైజన్ని బయట పెట్టుకొని కేసు నమోదైన వెంటనే సదరు వీడియోని డిలీట్ చేశారు.

బీసీల పట్ల, బిసి నాయకుల పట్ల ఇంత చులకన భావాన్ని కడుపులో పెట్టుకొని పైకి ప్రేమ కురిపించే టీడీపీ ఈ రోజు వైసీపీ బిసి ద్రోహి అని ప్రచారం చేయడం విడ్డురం.

ఆత్మశుద్ధిలేని యాచార మదియేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా?
విశ్వదాభిరామ వినుర వేమ…. అని వేమన చెప్పిన పద్యం బీసీల పట్ల చంద్రబాబు చూపించే కపట ప్రేమకు సరిగ్గా సరిపోతుంది.