iDreamPost
iDreamPost
మొహమ్మద్ ప్రవక్తపై బహిష్కృత బీజేపీనేతల వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడంలేదు. అరబ్ దేశాల ప్రభుత్వాలతోపాటు, సోషల్ మీడియాకూడా నెగిటీవ్ గా రియాక్ట్ అవుతోంది. అప్పటికీ తన వ్యాఖ్యల పట్ల నూపుర్ క్షమాపణలు చెప్పింది. వాళ్లపై బీజేపీ వేటువేయడాన్ని స్వాగతిస్తూనే, గల్ఫ్ దేశాలు మాత్రం ఆగ్రహాన్ని తగ్గించడంలేదు.
గల్ఫ్ దేశాలతో భారతదేశానికి గట్టి మిత్రత్వం ఉంది. ఇద్దరి మధ్య వ్యాపార, వాణిజ్య లావాదేవీలు వేల కోట్లలో నడుస్తున్నాయి. అందుకే భారత విదేశాంగ శాఖ గల్ఫ్ దేశాలతో చర్చిస్తున్న సమయంలోనే
కువైట్‌లోని అల్ అర్దియా కో ఆపరేటివ్ సొసైటీ సూపర్ మార్కెట్ భారతీయ ఉత్పత్తులను పక్కనపెట్టింది. నూపుర్ వ్యాఖ్యలకు నిరసిస్తున్నాం. ఇండియన్ ప్రొడెక్ట్స్ ను వాడేదిలేదంటూ పక్కన పెట్టేశారు. ఎందుకీ నిరసన? అనుచిత వ్యాఖ్యలను సహించం అందుకే భారతీయ ఉత్పత్తులను తొలగిస్తున్నామని స్టోరీ యాజమాన్యం చెబుతోంది.
అంతకుముందు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల మండిపడుతోంది. భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లాలనుకొనేవాళ్లకు, గల్ఫ్ దేశాలు ప్రధాన గమ్యస్థానం. విదేశాల్లో పని చేస్తున్న భారతీయుల సంఖ్య 13.5 మిలియన్లు. అంటే కోటి 35లక్షల మంది. అందుకే 87 లక్షల మంది అంటే 8.7 మిలియన్లు గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారన్నది విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్క. అందుకే గల్ఫ్ దేశాల ఆగ్రహాన్ని తగ్గించడానికి ఒకపక్క ప్రయత్నిస్తూనే మరోపక్క వాళ్ల వాదనను తిప్పికొడుతోంది ఇండియా.