iDreamPost
android-app
ios-app

ప్రాజెక్ట్ K – ఇంటరెస్టింగ్ అప్డేట్స్

  • Published May 18, 2022 | 5:27 PM Updated Updated May 19, 2022 | 6:41 PM
ప్రాజెక్ట్ K – ఇంటరెస్టింగ్ అప్డేట్స్

ఇప్పుడు ప్రభాస్ సినిమాలు ఎన్ని నిర్మాణంలో ఉన్నా స్పెషల్ క్రేజ్ ఎక్కువ ఉన్నది మాత్రం ప్రాజెక్ట్ కెకే. ప్యాన్ వరల్డ్ మూవీగా దర్శకుడు నాగ అశ్విన్ షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు నుంచి చెబుతూనే వచ్చారు. దాని తగ్గట్టే క్యాస్టింగ్ సెట్ కావడంతో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇంటరెస్టింగ్ అప్డేట్స్ ఫ్యాన్స్ కి హుషారునిచ్చేలా ఉన్నాయి. ప్రాజెక్ట్ కెలో ప్రభాస్ ఇంట్రో సీన్ పూర్తి చేశారు. అది ఎలా ఉంటుందనే లీక్ రాలేదు కానీ ఓవర్ ఎలివేషన్లు లేకుండా సింపుల్ గా ప్లాన్ చేశారట. మసాలా కంటెంట్ కాదు కాబట్టి దానికి తగ్గట్టే అశ్విన్ చాలా స్టైలిష్ గా డిజైన్ చేసినట్టు తెలిసింది.

ప్రస్తుతం చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి జూన్ చివరి నుంచి ప్రారంభిస్తారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని, అనుపమ్ ఖేర్ తదితర తారాగణంతో ఇది బాలీవుడ్ మూవీనా తెలుగునా అనే అనుమానం వచ్చేలా ఉన్నప్పటికీ నేటివిటీ మూలం మాత్రం మనదే ఉంటుందట. ప్రాజెక్ట్ కె రిలీజ్ మాత్రం ఆలస్యంగానే జరుగుతుంది. ముందు ఆది పురుష్ రిలీజ్ అవ్వాలి. సలార్ ఇంకా బ్యాలన్స్ ఉంది. మారుతీతో చేయబోయే రాజా డీలక్స్ (ప్రచారంలో ఉన్న టైటిల్)కి రెండు నెలలు కేటాయించాలి. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కి ఎంత టైం కావాలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నాలుగు అయ్యాకే ప్రాజెక్ట్ కెని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

అంటే అటుఇటుగా 2025లోనే విడుదల కావొచ్చన్న మాట. మరీ అంత లేటా అనిపించవచ్చు. కానీ ప్రాజెక్ట్ కె తెరకెక్కుతున్న విధానం, ఇంటర్ నేషనల్ స్టాండర్డ్స్ లో అశ్విన్ ప్లాన్ చేసుకున్న ఎపిసోడ్స్ మొత్తం కలిపి ఈ గ్రాండియర్ కి ఆ మాత్రం టైం న్యాయమే అనిపించేలా చేస్తాయి. అశ్వనీదత్ నిర్మాతగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ ఫాంటసీ డ్రామాకు మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు. దీపికా పదుకునే ఆల్రెడీ కొంత భాగంలో పాల్గొంది. సుమారు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె వివిధ విదేశీ భాషల్లో అనువదించి ఒకేసారి రిలీజ్ చేస్తారు. సో ఫ్యాన్స్ కి లాంగ్ వెయిటింగ్ చాలా ఉంది

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Giriş