iDreamPost
android-app
ios-app

Adbhutam Movie : నిర్మాతలు ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు

  • Published Oct 18, 2021 | 5:44 AM Updated Updated Oct 18, 2021 | 5:44 AM
  • Published Oct 18, 2021 | 5:44 AMUpdated Oct 18, 2021 | 5:44 AM
Adbhutam Movie  : నిర్మాతలు ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు

థియేటర్లు తెరుచుకుని జనం బాగానే వస్తున్న తరుణంలో తేజ సజ్జ కొత్త సినిమా అద్భుతం ఓటిటి బాట పట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. డిస్నీ హాట్ స్టార్ సుమారు 7 కోట్ల రూపాయలకు డీల్ సెట్ చేసుకుందనే టాక్ నిన్నంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా నటించిన ఈ టైం పీరియడ్ థ్రిల్లర్ లో చాలా యూనీక్ పాయింట్ ఉంటుందట. గతంలో బాబు బాగా బిజీ తీసిన మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్టైనర్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. కాకపోతే విడుదల విషయం వాయిదా పడుతూ వచ్చి ఆఖరికి ఇలా నేరుగా ఇంటికే వచ్చేయాలని నిర్ణయించుకుంది.

దీని వెనుక కారణాలు స్పష్టం. ఇప్పుడు హాట్ స్టార్ ఇచ్చిన డీల్ 7 కోట్లను అద్భుతం థియేటర్లలో వసూలు చేయాలంటే 12 కోట్ల దాకా గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. కానీ అదంత ఈజీ కాదు. యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప జరగదు. కానీ తేజ సజ్జ క్రౌడ్ పుల్లింగ్ ఓపెనర్ కాదు. అందుకే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ,మొన్నా మధ్య ఇష్క్ కి కనీస స్థాయిలో వసూళ్లు రాలేదు. చాలా చోట్ల రెంట్లు కూడా రాక మొదటి వారానికే డెఫిషిట్ లో పడిపోయింది. అందుకే అద్భుతం విషయంలో చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. వచ్చే నెల అంటే నవంబర్ లో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. డేట్ త్వరలో ప్రకటిస్తారు.

ఒకటి మాత్రం వాస్తవం. నిర్మాతలు ప్రాక్టికల్ గా ఆలోచించక తప్పదు. ప్రతి సినిమానీ మేము థియేటర్ లోనే రిలీజ్ చేశామని గర్వంగా చెప్పుకునే రోజులు కావివి. సినిమా బాగుంటే సరే. ఏ మాత్రం తేడా వచ్చినా డిస్ట్రిబ్యూటర్లతో మొదలుకుని ప్రొడ్యూసర్ల దాకా అందరూ నష్టపోవాల్సిందే. ఖచ్చితంగా థియేటర్ మెటీరియల్ అయితే ఎంత కాలమైనా ఆగొచ్చు. అలా కాకుండా స్వీయ విశ్లేషణలో తమ సినిమాను ప్రేక్షకులు స్క్రీన్ మీద రిసీవ్ చేసుకోరేమో అని అనుమానం కలిగినప్పుడు ఓటిటికి ఇచ్చేయడం బెటర్. లేదూ మన సినిమా చేసే బిజినెస్ కన్నా డిజిటల్ లో వచ్చిన ఆఫర్ లాభసాటి అనుకుంటే ఇలా చేసుకోవడం ఉత్తమం. అద్భుతం చేసింది అదే

Also Read : Tabbar : కుటుంబం కోసం హత్యలు చేసే తబ్బర్

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibom