iDreamPost
iDreamPost
గుజరాత్ లోని ముంద్రా పోర్టులో డ్రగ్స్ పట్టుకున్నారు. కంటైనర్లలో టాల్కమ్ పౌడర్ పేరుతో తరలిస్తున్న హెరాయిన్ దొరికింది. దానికి చెన్నై కి చెందిన మాచవరం సుధాకర్, ఆయన భార్య వైశాలితో పాటుగా కోయంబత్తూరుకి చెందిన రాజ్ కుమార్ బాధ్యులుగా డీఆర్ఐ నిర్ధారించింది. ఈకేసు ప్రస్తుతం ఎన్ఐఏ చేతికి అప్పగించారు. ఈ ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ దాఖలయ్యింది. ఇదంతా సెప్టెంబర్ 17న తనిఖీలలో డ్రగ్స్ దొరక్కా విషయం అదే నెల 20న బయటకు వచ్చింది. 22న విజయవాడకి చెందిన అడ్రస్ తో జీఎస్టీ సర్టిఫికెట్ ఉండడంతో సత్యన్నారాయణపురంలోని ఓ ఇంట్లో ఆషీ ట్రేడర్స్ కి సంబంధించిన వ్యవహారాలపై తనిఖీలు జరిగాయి.
ఇంత పెద్ద మొత్తంలో దేశంలో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. అదానీకి చెందిన పోర్టులో దాదాపు 21 కోట్ల రూపాయల విలువజేసే హెరాయిన్ పట్టుబడిన తరుణంలో కేంద్ర నిఘాసంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇంకా దర్యాప్తు చేస్తున్నాయి. మూలాలు కనుక్కుంటే యువత భవితవ్యాన్ని నాశనం చేస్తున్న రాకెట్ బయటపడే అవకాశం ఉంటుంది. అలాంటి విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాలని అంతా ఆశిస్తున్నారు. కానీ ఏపీలో టీడీపీ నేతలకు మాత్రం అవేమీ పట్టనట్టే ఉంది. తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా సాగుతోంది. కాకినాడ పోర్టు చుట్టూ కథన నడపాలని ఆశిస్తోంది. మొదట కృష్ణపట్నం పోర్టు అంటూ కథనాలు అల్లినా ఇప్పుడు కాకినాడకు మళ్లించింది.
Also Read : డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ ఆరాటం ఎందుకో, ఆపార్టీ నేతల దృష్టి అటు మళ్లిందెందుకో?
కాకినాడలో సెప్టెంబర్ 16 సాయంత్రం ఓ బోటు ప్రమాదంలో చిక్కుకుంది. షార్ట్ సర్క్యూట్ తో అది కాలిపోయిందని పోలీస్, ఫైర్ అధికారులు నిర్ధారించారు. జగన్నాధపురం వంతెన సమీపంలో ఏటిలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమయ్యి దానిని కాపాడాలని యత్నించినా బోటు మాత్రం కాలిపోయిందని అధికారులు చెబుతున్నారు. కానీ సెప్టెంబర్ 17న హెరాయిన్ పట్టుబడితే సెప్టెంబర్ 16న బోటు ప్రమాదం ఘటనను దానికి ముడిపెట్టేసి టీడీపీ నేతలు కహానీలు అల్లడం మొదలెట్టారు. కొన్ని టీవీ చానెళ్లయితే డ్రగ్స్ తరలిస్తుందడగా సముద్రంలోనే బోటు కాలిందని కూడా వక్రీకరణలు, వక్రభాష్యాలు చెప్పేశారు.
ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు మరో అడుగుముందుకేసి తీవ్ర విమర్శలకు పూనుకున్నారు. ఈ పరిణామాల పట్ల పోలీసులు స్పందించారు. టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర ఆరోపణలపై కాకినాడ పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఏపీలో ఈ డ్రగ్స్ వ్యవహారాలకు సంబంధం లేదని డీజీపీ ఇప్పటికే స్పందించారు. అయినప్పటికీ కాకినాడ ఏటిలో జరిగిన బోటు ప్రమాదాన్ని, సముద్రంలో డ్రగ్స్ తరలిస్తుండగా జరిగిన ఘటనగా చిత్రీకరించే యత్నం చేయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దానికి సంబంధించి ఆధారాలుంటే ఇవ్వాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వారం రోజుల గడువుతో టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. దాంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. టీడీపీ నేతల మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది.
Also Read : టీడీపీ పట్టాభికి షాకిచ్చిన కాకినాడ మత్స్యకారులు