iDreamPost
android-app
ios-app

ఆ ప్రవర్తన నచ్చలేదు.. అమె గెలవదంటూ ప్రియాంక లవర్ షాకింగ్ కామెంట్స్!

  • Published Dec 13, 2023 | 9:39 PM Updated Updated Dec 13, 2023 | 9:39 PM

Priyanka Jain Lover Shiva Kumar Comments: బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న ఆట.. టైటిల్ విన్నర్ గురించి ప్రియాంక ప్రియుడు శివకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Priyanka Jain Lover Shiva Kumar Comments: బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న ఆట.. టైటిల్ విన్నర్ గురించి ప్రియాంక ప్రియుడు శివకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Dec 13, 2023 | 9:39 PMUpdated Dec 13, 2023 | 9:39 PM
ఆ ప్రవర్తన నచ్చలేదు.. అమె గెలవదంటూ ప్రియాంక లవర్ షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆఖరి మజిలీకి చేరుకుంది. మరి కొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం కూడా దొరుకుతుంది. ప్రస్తుతానికి నెట్టింట పలువురి పేర్లు అయితే వైరల్ అవుతున్నాయి. వారికి బయట ఉన్న క్రేజ్, వారికి పడుతున్న ఓట్లను ఆధారంగా చేసుకుని ఈ మాటలు చెబుతున్నారు. అయితే ఎవరు విన్నర్ అనేది మాత్రం తెలియాలంటే కాస్త ఆగాల్సిందే. ఎవరికి వాళ్లు తమ కంటెస్టెంట్ గెలుస్తారంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. కానీ, ఇలాంటి తరుణంలో ప్రియాంక ప్రియుడు శివ కుమార్ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రియాంక గెలవదు అంటూ శివకుమార్ కామెంట్ చేశాడు.

బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక జైన్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫినాలే వీక్ కి చేరుకుంది. హౌస్ లో ఎంటర్ టైన్మెంట్, టాస్కులు, కిచెన్ లో తన ఎఫర్ట్స్ పెడుతూ అభిమానుల మన్ననలు పొందింది. పొట్టిపిల్ల కాదు.. గట్టిపిల్ల అంటూ బిరుదును కూడా అందుకుంది. హౌస్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి ఉంటూనే.. ఇండివిడ్యవల్ గా ఆడుతూ వచ్చింది. తనకి ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా అవి ఆఖరి వరకు వచ్చి చేతికి అందలేదు. అయినా ధైర్యంగా ఆటలో నిలబడింది. కొన్నిసార్లు నమ్మిన ఫ్రెండ్స్ హర్ట్ చేసినా కూడా అధైర్య పడలేదు. ఇలాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ గురించి శివకుమార్ చేసిన కామెంట్స్ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రియాంక జైన్ గెలవలేదు అంటూ కామెంట్స్ చేశాడు. అలాగే విన్నర్ ఎవరో కూడా తన మాటల్లో చెప్పుకొచ్చాడు. మరోవైపు అమర్ ప్రవర్తన కూడా నచ్చలేదని చెప్పాడు.

“బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందే అమర్- ప్రియాంక మంచి ఫ్రెండ్స్. వాళ్లు కలిసి జానకి కలగనలేదు సీరియల్ లో నటించారు. వాళ్లిద్దరు ఒకరికి ఒకరు ఇచ్చుకునే గౌరవం చూస్తే నాకు ముచ్చటేస్తుంది. అయితే అలాంటి అమర్ ప్రియాంకతో బాల్ టాస్కులో ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు. ఆ సమయంలో బాల్ కోసం ప్రియాంకను ఎత్తి కిందపడేయడం బాధ కలిగించింది. ప్రియాంక అమ్మానాన్ని 24*7 లైవ్ చూస్తూ ఉంటారు. అమర్ ప్రవర్తన చూసి వాళ్లు కూడా కంగారు పడ్డారు.. ఆ తర్వాత అది టాస్కులో భాగమే అని తెలిసి లైట్ తీసుకున్నరు. ప్రియాంక చాలా స్ట్రాంగ్ ప్లేయర్. ఆమె టైటిల్ కొట్టాలనే ఉద్దేశంతోనే హౌస్ లోకి అడుగుపెట్టింది. కానీ, ఆమె గెలిచే పరిస్థితులు లేవు. పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ టైటిల్ విన్నర్ అవుతాడు” అంటూ శివకుమార్ కామెంట్స్ చేశాడు. ప్రియాంక గెలవదని చెప్పడం మాత్రమే కాకుండా.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత టైటిల్ విన్నర్ అవుతాడంటూ కామెంట్స్ చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలాగే ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రం శివ కుమార్ చెప్పినట్లు జరగాలంటూ ఆకాంక్షిస్తున్నారు. తమ రైతు బిడ్డ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. మరి.. ప్రియాంక జైన్ గెలవదు.. పల్లవి ప్రశాంత్ విజయం సాధిస్తాడంటూ శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom