iDreamPost
iDreamPost
కాంగ్రెస్ అధినాయకత్వంలో నేతలు ఒక్కొక్కరుగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. సోనియా గాంధీకి కరోనా సోకి రోజు కాకముందే, ఆమె కుమార్తె, ప్రియాంక గాంధీకి వైరస్ సోకింది. ఈ సంగతి ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. హోం ఐసోలేషన్ లో ఉన్నా. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తున్నట్లు, తనను కలిసిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. తల్లికి కరోనా ఉందని తెలుసుకున్న ఆమె, లక్నో నుంచి ఢిల్లీకి వచ్చారు. లక్నోలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రియాంక పాల్గొనాల్సి ఉంది. ఈ సమావేశాల నుంచి ఆమె వెనక్కి వచ్చేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 8న ఈడీ ముందుకు సోనియా హాజరవాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆమె స్వీయ నిర్భందంలో ఉన్నారు. మరి విచారణకు హాజరవుతారా? లేదా? మరోవైపు భారతదేశంలో కరోనా అంకెలు పెరుగుతున్నాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. గత కొద్ది రోజులుగా రెండు వేలులోపే నమోదవుతున్న సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా కేసులు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్రం కూడా అలర్ట్ అయ్యింది. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.