iDreamPost
android-app
ios-app

డిఫరెంట్ థ్రిల్లర్ లో ప్రియమణి

  • Published Jun 24, 2021 | 7:19 AM Updated Updated Jun 24, 2021 | 7:19 AM
డిఫరెంట్ థ్రిల్లర్ లో ప్రియమణి

కెరీర్ ప్రారంభంలోనే నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో ఆడి పాడిన ప్రియమణి అవి హిట్ అయినా టైం అంతగా కలిసి రాక తక్కువ టైంలోనే గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. 2017లో పెళ్లి చేసుకున్నాక తనకు సెకండ్ ఇన్నింగ్స్ బాగా కలిసి వస్తోంది. ఒకపక్క వెబ్ సిరీస్ లు, మరోవైపు సినిమాలతో బిజీగా ఉంది. ఓటిటి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ మ్యాన్ లో తన పాత్రకు ప్రాధాన్యం తక్కువే అయినప్పటికీ అందులో నటించడం చాలా ప్లస్ అయ్యింది. మనోజ్ బాజ్ పాయ్ తో పాటుగా ఇకపై ఆ సిరీస్ ప్రతి సీజన్ లోనూ తను భాగం కాబోతోంది. ఇవి కాకుండా జీ5 లాంటి ఇతర సంస్థల్లో చేసిన డిజిటల్ మూవీస్ కూడా బాగానే పేరు తీసుకొచ్చాయి.

ప్రియమణివి తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల్లో వెంకటేష్ నారప్ప, రానా విరాట పర్వం మీద ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇవి క్లిక్ అయితే డిమాండ్ ఇంకా పెరగడం ఖాయం. హిందీలో చేస్తున్న అజయ్ దేవగన్ మైదాన్ షూటింగ్ ఇంకొంచెం బ్యాలన్స్ ఉంది. సైనైడ్ అనే మల్టీ లాంగ్వేజ్ మూవీ నిర్మాణం జరుగుతోంది. కన్నడలో నటించిన డాక్టర్ 56 పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. ఇక విషయానికి వస్తే తెలుగులో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కోసం ప్రియమణినే లాక్ చేసినట్టు లేటెస్ట్ అప్ డేట్. ఓ శాండల్ వుడ్ రీమేక్ కోసం తనను సంప్రదించినట్టుగా తెలిసింది

గత ఏడాది కన్నడలో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకున్న యాక్ట్ 1978లో ప్రియమణినే కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఇదింకా అధికారికంగా ప్రకటించలేదు కానీ చర్చల దశలో ఉందని వినికిడి. ఈ యాక్ట్ 1978 ఒక డిఫరెంట్ పాయింట్ తో రూపొందింది. ప్రభుత్వ అధికారుల అలసత్వం లంచగొండితనంతో విసుగెత్తిన ఓ గర్భిణీ నడుముకు బాంబు చుట్టుకుని గవర్నమెంట్ ఆఫీస్ కు వెళ్లి మొత్తం లాక్ చేస్తుంది. అక్కడి నుంచి డ్రామా మొదలవుతుంది. గతంలో వచ్చిన ఏ వెడ్ నెస్ డే(వెంకటేష్ ఈనాడు) తరహాలో అనిపించినప్పటికీ యాక్ట్ 1978 మంచి కాన్సెప్ట్ తో మెప్పించే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişJojobet Güncel GirişMarsbahisJojobetHoliganbet