iDreamPost
android-app
ios-app

Diabetes Drugs మ‌ధుమేహ ఔష‌ధ ధ‌ర‌లు త‌గ్గుతున్నాయ్!

  • Published Aug 26, 2022 | 1:26 PM Updated Updated Aug 26, 2022 | 1:26 PM
Diabetes Drugs మ‌ధుమేహ ఔష‌ధ ధ‌ర‌లు త‌గ్గుతున్నాయ్!

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(NATIONAL PHARMA PRICING AUTHORITY) 45 డ్ర‌గ్ ఫార్ములేష‌న్ రిటైల్ ధరలను నిర్ణయించింది, వీటిలో రక్తపోటు(hypertension), సాధారణ జలుబు(common cold), ఇన్ఫెక్షన్లు(infections), అసిడిటీ వంటి చికిత్సలో వాడ‌తారు.
ధరలను త‌గ్గించిన కొన్ని మందుల‌ను అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిల చికిత్సలో కూడా వాడ‌తారు.

ఉదాహరణకు, పారాసెటమాల్(Paracetamol), ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్(Phenylephrine Hydrochloride), కెఫిన్ & డిఫెన్‌హైడ్రామైన్ హైడ్రోక్లోరైడ్ మాత్రల కాంబినేష‌న్ రిటైల్ ధర రూ. 3.73గా నిర్ణయించారు. ఈ టాబ్లెట్ ల కాంబినేష‌న్ ను అలెర్జీ, సాధారణ జలుబును త‌గ్గించ‌డానికి వాడ‌తారు. ఈ కాంబినేష‌న్ రేటు కూడా బాగా త‌గ్గింది.

మ‌ధుమేంతో స‌హా అనేక వ్యాధుల చికిత్స‌కు ఉప‌యోగించే 45 ర‌కాల ఔష‌ధాల రిటైల్ రేటును జాతీయ ఔష‌ధ ధ‌ర‌ల నియంత్ర‌ణ సంస్థ స‌వ‌రించింది. డ‌యాబెటిక్ పేషెంట్లు వాడే సిటాగ్లిప్టిన్- మెట్ పామిన్ కాంబినేష‌న్, లినాగ్లిప్టిన్- మెట్ పామిన్ కాంబినేష‌న్ డ్ర‌గ్స్ కూడా ఇలా స‌వ‌రించిన ధ‌ర‌లు లిస్ట్ లో ఉన్నాయి. వీటి పేటెంట్స్ హ‌క్కుల కాలప‌రిమితి ముగిసినందున వాటి రేట్ల‌ను క‌ట్టడిచేసింది. ఇప్పుడు మార్కెట్ లో 15 ట్యాబ్లెట్లు ఉండే సిటాగ్లిప్లిన్-మెట్ ఫామిన్ ప్యాక్ ధ‌ర రూ.345. ఇప్పుడు స‌వ‌రించిన రేట్ల ప్ర‌కారం, ఒక్కో ట్యాబ్లెట్ రేటు రూ.16-21 మ‌ధ్య‌లో ఉండ‌నుంది.

అమోక్సిసిలిన్(Amoxycillin) , పొటాషియం క్లావులనేట్ ఓరల్ సస్పెన్షన్(Potassium Clavulanate Oral Suspension) ధర రూ. 168.43గా నిర్ణయించారు. ఈ కాంబినేష‌న్ ను యాంటీబ‌యోటిక్ గా యూజ్ చేస్తున్నారు. అంత‌క‌న్నా ముఖ్య‌మైన సంగ‌తి మధుమేహం చికిత్సలో ఉపయోగించే సిటాగ్లిప్టిన్(Sitagliptin ) మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ (Metformin Hydrochloride ) మాత్రలతో సహా ఒక ఫార్మురేష‌న్ రేటు రూ. 18.67 కంటే ఎక్కువ ఉండ‌కూడ‌దని ప్రైసింగ్ అథారిటీ తేల్చిచెప్పింది. దీనివ‌ల్ల డ‌యాబిటీస్ చికిత్స మ‌రింత చౌక అవుతుంది. ఎక్కువ‌మందికి అందుబాటులోకి వ‌స్తుంది.

Drug Price Control Order (2013) ప్ర‌కారం ఈ ఔష‌దాల రేట్లను నియంత్రించారు. ఫిక్స్‌డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్‌లు పెరుగుతున్నాయ‌న్న ఆందోళనల మధ్య తాజా నోటిఫికేషన్ వచ్చింది.
ముందు ఈ మందులు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా ఆమోదం పొందాలి. ఆ త‌ర్వాతే రిటైల్ కొత్త ధ‌ర‌లు వ‌ర్తిస్తాయి.