iDreamPost
android-app
ios-app

ప్రెగ్నెన్సీతో పోకిరి భామ.. బాయ్ ఫ్రెండ్ ఫోటో షేర్!

ప్రెగ్నెన్సీతో పోకిరి భామ.. బాయ్ ఫ్రెండ్ ఫోటో షేర్!

జీరో సైజ్ సుందరి, గోవా బ్యూటీ ఇలియానా గురించి టాలీవుడ్  ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేవదాస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు  ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పోకిరీ మూవీతో ఫుల్ క్రేజ్ సంపాదించింది. పోకిరి సినిమా ఇచ్చిన బ్లాక్ బాస్టర్ తో ఈ ముద్ద గుమ్మకు అవకాశాలు అమాంతం పెరిగాయి. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ భామ ప్రెగ్నెన్సీతో ఉన్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పటి వరకు  తన బాయ్ ఫ్రెండ్ ఎవరో బయట పెట్టలేదు. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ఫోటోను ఈ గోవా బ్యూటీ బయట పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన వారిలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. దేవదాసు సినిమాతో తెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ.. తన అందంతో కుర్రాళ్లందరిని దేవదాసులుగా మార్చింది. ఇక పోకిరి సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ సినిమా ఇచ్చిన హిట్ తో ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్నేళ్ల పాటు వెనక్కి తిరిగి చూడలేదు. స్టార్ హీరోలందరి సరసన ఈ భామ నటించింది. టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే బాలీవుడ్ కి చెక్కేసింది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ జీరో సైజ్ సుందరిపై కోపం పెంచుకున్నారు. తమను వదిలేసి ఎలా వెళ్తావు బేబి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత సినిమా పరిశ్రమలో అవకాశాలు తగ్గతాయి. అప్పుడు మాత్రమే వెండి తెరపై ఇలియానా మెరుస్తుంది. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే.. ప్రెగ్నెన్సీతో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పటి వరకు బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే విషయాన్ని మాత్రం రివిల్ చేయలేదు.

తాజాగా తన ఇన్ స్టాలో స్టోరీస్ పోస్ట్ చేసిన సోషళ్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో  ఉన్న  ఈ గోవా బ్యూటీ.. తన బాయ్ ఫ్రెండ్ ఫోటోను అభిమానులతో పంచుకుంది.  డేట్ నైట్ అంటూ క్యాప్షన్ ఇచ్చి.. అతని తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే పేరును మాత్రం ఈ అమ్మడు వెల్లడించలేదు. కాగా.. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్  మిచెల్ తో  ఈ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే  తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలోని వ్యక్తి మాత్రం అతను కాదు. దీంతో  అందరి ఊహగానాలకు తెరపడింది.  దీంతో త్వరలోనే ఈ ముద్దుగుమ్మ బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పటిలోగా తన బాయ్ ఫ్రెండ్ పేరును ప్రకటిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం ఇలియానా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అందుకే ప్రేమలో పడ్డాను.. వైరల్ అవుతున్న సాయిపల్లవి పోస్ట్!

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetparktimebetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetlunabetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş