iDreamPost
android-app
ios-app

అందుకే ప్రేమలో పడ్డాను.. వైరల్ అవుతున్న సాయిపల్లవి పోస్ట్!

  • Author ajaykrishna Published - 10:50 AM, Mon - 17 July 23
  • Author ajaykrishna Published - 10:50 AM, Mon - 17 July 23
అందుకే ప్రేమలో పడ్డాను.. వైరల్ అవుతున్న సాయిపల్లవి పోస్ట్!

చిత్రపరిశ్రమలో లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి రూట్ వేరు. ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా.. ఎటువంటి గ్లామర్ షో చేయకుండా.. తాను చేసిన క్యారెక్టర్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో సాయిపల్లవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎంతోమంది గ్లామరస్ బ్యూటీలు ఉన్నప్పటికీ.. తెలుగువాళ్లకు సాయిపల్లవి ఎంతో స్పెషల్. హీరోలకు సమానంగా సాయిపల్లవి సినిమాలను ఆదరిస్తుంటారు. అందుకే సాయిపల్లవికి లేడీ పవర్ స్టార్ అని బిరుదు కూడా ఓ అగ్రదర్శకుడు ఇవ్వడం మామూలు విషయం కాదు. అయితే.. కొంతకాలంగా సాయిపల్లవి సినిమాలు తగ్గించేసింది.

రెగ్యులర్ గా ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ లా కాకుండా ఎప్పుడో ఓ సినిమా ఓకే చేస్తోంది. అందరు హీరోయిన్స్ దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా ఓకే చేసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. పైగా ఈరోజుల్లో ఉన్న పోటీకి హీరోయిన్స్ కెరీర్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఎవరు చెప్పలేరు. అయితే.. సాయి పల్లవికి ఊహించని విధంగా పాన్ ఇండియా వైడ్ క్రేజ్ ఉన్నా.. సినిమాలు మాత్రం స్లోగా ఎంపిక చేసుకుంటోంది. ముందునుండి ఎలాంటి గ్లామర్ షో, వల్గారిటీ జోలికి పోకుండా ఉన్న సాయిపల్లవి.. హోమ్లీ బ్యూటీగా ఫ్యామిలీ ఆడియన్స్ ని సైతం సంపాదించుకుంది. అయితే.. మొన్నటిదాకా ఆమె చేసిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ నిరాశపరిచాయి.

దీంతో తనవల్ల నిర్మాతలు ఇంకా నష్టపోవడం ఇష్టంలేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. కొత్త సినిమాలేవి ఓకే చేయకుండా.. తాను లాస్ట్ ఓకే చేసిన తమిళ సినిమా కంప్లీట్ చేస్తోంది. ఆ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. కాగా.. తాజాగా తాను చివరిగా కనిపించిన ‘గార్గి’ మూవీ గురించి ఓ ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టింది. గతేడాది జులై 15న విడుదలైన గార్గి మూవీకి.. మొన్నటితో ఏడాది పూర్తి అయింది. ఈ సందర్బంగా సాయిపల్లవి.. ‘గార్గి సినిమా వచ్చి సంవత్సరం పూర్తయింది. అందులోని నా పాత్ర నాపై చాలా ప్రభావం చూపింది. నన్ను ఎంతగానో సినిమాలను ప్రేమించేలా చేసింది. అయితే ఈ అవకాశం నాకు ఇచ్చిన దర్శకుడు గౌతమ్ కి ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి సాయిపల్లవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş