iDreamPost
android-app
ios-app

ప్రవళిక కేసులో ఊహించని ట్విస్ట్‌!

ఈ నెల 13న రాత్రి ఆమె హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. గ్రూపు -2 పరీక్షలు వాయిదా వేయటం కారణంగానే ఆమె చనిపోయిందన్న ప్రచారం మొదలైంది.

ఈ నెల 13న రాత్రి ఆమె హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. గ్రూపు -2 పరీక్షలు వాయిదా వేయటం కారణంగానే ఆమె చనిపోయిందన్న ప్రచారం మొదలైంది.

ప్రవళిక కేసులో ఊహించని ట్విస్ట్‌!

ప్రవళిక కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రవళిక మరణానికి కారణం అని భావిస్తున్న శివరామ్‌ కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని, శివరామ్‌ తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. శివరామం ఆచూకీ కోసం తమను ఇబ్బంది పెట్టారని, ఆచూకీ చెప్పకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తామన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుటుంబానికి చిక్కడ్‌పల్లి పోలీసులనుంచి ప్రాణ భయం ఉందని,

వారికి రక్షణ కల్పించాలని శివరామ్‌ బంధువు సంతోష్‌ రాథోడ్‌ హెచ్‌ఆర్‌సీని కోరాడు. ఇదిలా ఉండగా.. శివరామ్‌ రాథోడ్‌ తాజాగా అజ్ఞాతం నుంచి బయటకు వచ్చాడు. శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అక్కడ సరెండర్‌ పిటిషన్‌ను దాఖలు చేశాడు. శివరామ్‌ వేసిన పిటిషన్‌కు కోర్టు అనుమతినిచ్చింది. కాగా, వరంగల్‌ జిల్ల దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవళిక గ్రూపు-2 కోసం ప్రిపేర్‌ అవ్వటానికి హైదరాబాద్‌ వచ్చింది. ఇక్కడే హాస్టల్‌లో ఉంటూ చదువుకోసాగింది.

ఈ నెల 13న రాత్రి ఆమె హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. గ్రూపు -2 పరీక్షలు వాయిదా వేయటం కారణంగానే ఆమె చనిపోయిందన్న ప్రచారం మొదలైంది. ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ పోలీసులు అసలు విషయాన్ని వెల్లడించారు. శివరామ్‌తో ప్రేమ వ్యవహారం బ్రేక్‌ అవ్వటం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని స్పష్టం చేశారు. శివరామ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతడి కోసం గాలించసాగారు. దాదాపు 10 తర్వాత అతడు అజ్ఞాతం వీడాడు. పోలీస్‌ స్టేషన్‌కు కాకుండా.. నేరుగా కోర్టులో లొంగిపోయాడు. మరి, శివరామ్‌ కోర్టులో లొంగిపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి