iDreamPost
android-app
ios-app

ఒకే సినిమాలో 10 హీరోయిన్లు

  • Published Apr 28, 2022 | 4:20 PM Updated Updated Apr 28, 2022 | 4:20 PM
  • Published Apr 28, 2022 | 4:20 PMUpdated Apr 28, 2022 | 4:20 PM
ఒకే సినిమాలో 10 హీరోయిన్లు

అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత తీవ్రంగా ఉంటే ఒకే సినిమాలో పది మంది ఎలా అనుకుంటున్నారా. దర్శకుడు ప్రశాంత్ వర్మ అదే లక్ష్యంతో ఒక కథను రాసుకున్నారట. ప్రస్తుతం తేజ సజ్జతో హనుమాన్ పూర్తి చేసే పనిలో ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ కు జాంబీ రెడ్డి సక్సెస్ మంచి బూస్ట్ ఇచ్చింది. అంతకు ముందు కల్కి చేసిన గాయం అంతో ఇంతో తగ్గించేసింది. ఇక ఇప్పటి ప్రాజెక్ట్ విషయానికి వస్తే ప్రశాంత్ విహారి సిద్ధం చేస్తున్న స్క్రిప్ట్ లో పది మందికి స్కోప్ ఉండటంతో పాటు ఒకరికి మరొకరికి స్క్రీన్ ప్లేలో మంచి లింక్ కుదిరేలా చేసిన వైనం బాగా వచ్చిందట. మరి దీనికి నిర్మాత ఎవరు ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతానికి అనుపమ పరమేశ్వరన్ కు లైన్ చెప్పినట్టు వినికిడి. ఆ మధ్య మాయమైపోయి హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు, రౌడీ బాయ్స్ లాంటి సినిమాలతో కం బ్యాక్ ఇచ్చిన అనుపమకు ఆశించిన పెద్ద బ్రేక్ దక్కడం లేదు. నిఖిల్ తో చేసిన 18 పేజెస్ విడుదలకు రెడీగా ఉంది కానీ ఇంకా డేట్ ని ప్రకటించలేదు. దీని మీద చాలా హోప్స్ ఉన్నాయి. ప్రశాంత్ వర్మకు ఓకే చెప్పినా మిగిలిన వాళ్ళను సెట్ చేసుకోవడం మరీ బ్రహ్మ విద్య కాదు. మెహ్రీన్, నివేత పేతురాజ్, ఈషా రెబ్బ, రెజీనా వగైరా అందుబాటులోనే ఉన్నారు. అందరికీ లైన్ నచ్చితే ఈజీగా పట్టాలు ఎక్కేస్తుంది. ఫిమేల్ ఓరియెంటెడ్ అయినప్పటికీ ఇందరేసి భామలు ఉంటే చూడకుండా ఉంటారా.

అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇక హనుమాన్ సంగతికొస్తే ప్రశాంత్ వర్మ కెరీర్ లోనే హయ్యెస్ట్ బిజినెస్ చేసుకుందనే ఇన్ సైడ్ టాక్ బలంగా వినిపిస్తోంది. హిందీ డిజిటల్ డబ్బింగ్ నుంచే 12 కోట్ల దాకా వచ్చిందని అంటున్నారు. ఇది పెద్ద మొత్తమే. ఇండియన్ ఫస్ట్ సూపర్ హీరో క్యాప్షన్ తో హనుమంతుడి కథను చెప్పబోతున్నారా లేక ఏదైనా ఫాంటసీ మిక్స్ చేశారా అనేది ట్రైలర్ వచ్చాక ఒక ఐడియా వస్తుంది. రెగ్యులర్ శైలిలో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తున్న ప్రశాంత్ వర్మ పది మంది హీరోయిన్లు సరే మరి వాళ్లకు హీరోలు ఉంటారా లేక కేవలం మహిళా సంఘంతోనే మేనేజ్ చేస్తారా చూడాలి

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş