iDreamPost
android-app
ios-app

క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

  • Published Jun 25, 2021 | 8:30 AM Updated Updated Jun 25, 2021 | 8:30 AM
క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

వెయ్యి లోపే సభ్యులున్న మా అసోసియేషన్ అధ్యక్షపదవి ఎన్నిక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ఇవాళ ప్రకాష్ రాజ్ స్వయంగా తన పానెల్ సభ్యులతో సుమారు గంట పాటు ప్రెస్ మీట్ నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికిది సినిమాలతో సంబంధం లేని విషయమే అయినప్పటికీ అందరూ పెద్ద తలకాయలే ఉండటంతో సాధారణం జనంలో కూడా ఇప్పుడీ ఎలక్షన్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. అందులోనూ గత కొద్దిరోజులుగా కొన్ని పేరుమోసిన మీడియా ఛానల్స్ లో దీని మీద పెద్ద ఎత్తున డిబేట్లు పెడుతున్నారు. అందులో ప్రకాష్ రాజ్ లోకల్ నాన్ లోకల్ వివాదం కూడా హై లైట్ అవుతూ వచ్చింది.

ఈ రోజు జరిగిన సమావేశంలో నాగబాబు, శ్రీకాంత్, బండ్ల గణేష్, బెనర్జీ, అనసూయ, ప్రగతి, ఏడిద శ్రీరామ్, సమీర్, శివారెడ్డి,తనీష్, సనా, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ మాట్లాడలేదు కానీ ఉన్నంతలో మీడియా గురించిన కామెంట్స్ రావడంతో కాస్త వేడి చర్చ జరిగింది. తన స్థానికత గురించి మాట్లాడిన ప్రకాష్ రాజ్ తొమ్మిది నందులు వచ్చినప్పుడు, ఇక్కడి గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు ఎవరూ ఈ అంశం లేవనెత్తలేదని ఇక్కడి ఆర్టిస్టులు ఎందరో ఇతర భాషల్లో రుజువు చేసుకున్నప్పుడు రాని ఇష్యూ ఇప్పుడు మాత్రమే హై లైట్ అవ్వడానికి కారణం ఏమిటో ఆలోచించుకోవాలని ఒకరకంగా మీడియానే ప్రశ్నించారు.

మరోవైపు బండ్ల గణేష్, నాగబాబుల మాటల్లో చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకాష్ రాజ్ కే ఉందనే క్లారిటీ వచ్చేసింది. ఒకవైపు మేమంతా ఒకటే అంటున్న ఆర్టిస్టులు నలుగురు పోటీకి దారి తీసిన కారణాలు మాత్రం చెప్పలేకపోయారు. ప్రకాష్ రాజ్ ప్రజాస్వామ్యంలో ఎక్కువ పోటీ ఉంటేనే అర్ధముంటుందని చెప్పడంలో కొంత లాజిక్ అయితే ఉంది. సో రేపు ఎల్లుండి రాబోయే రోజుల్లో ఇదే తరహా సమావేశాలు మంచు విష్ణు, జీవిత, హేమల నుంచి ఉండబోతోందని అర్థమయ్యింది. జయసుధ, సాయి కుమార్లు వీడియో రూపంలో తమ సపోర్ట్ ని ప్రకాష్ రాజ్ కు తెలిపారు. సో ఎలక్షన్ అయ్యేదాకా ఈ టాపిక్ హాట్ గానే ఉండబోతోంది