iDreamPost
android-app
ios-app

ప్రభాస్ చెప్పిన టైంకే రాగలడా?

  • Published Feb 29, 2020 | 5:10 AM Updated Updated Feb 29, 2020 | 5:10 AM
  • Published Feb 29, 2020 | 5:10 AMUpdated Feb 29, 2020 | 5:10 AM
ప్రభాస్ చెప్పిన టైంకే రాగలడా?

సాహో లాంటి డిజాస్టర్ టేస్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంలో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం దాని షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు. ఇటీవలే నాగ అశ్విన్ తో వైజయంతి మూవీస్ తీయబోయే చిత్రం తాలూకు అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. ఇదిలా ఉండగా రాధాకృష్ణ తీస్తున్న మూవీకి రాధే శ్యామ్, ఓ డియర్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారని ఫిలిం నగర్ టాక్.

దాని ప్రకారం అక్టోబర్ 16న ఈ సినిమా విడుదల ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. అయితే అసలు సమస్య ఇలా ఒక డేట్ ముందే అనుకుంటే ప్రభాస్ దానికి కట్టుబడి ఉండగలడా అని. గత ఏడాది సాహోని ఇలాగే ఆగష్టు 15 అని ముందు నుంచి ఊరిస్తూ వచ్చి చివరికి రెండు వారాలు ఆలస్యంగా బరిలోకి దించారు. ఏవేవో కారణాలు ప్రచారమయ్యాయి కాని అసలు రహస్యం బయటికి రాలేదు. ఇప్పుడు అక్టోబర్ 16 అంటే పాన్ ఇండియా కోణంలో సేఫ్ డేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ బడ్జెట్ బాలీవుడ్ సినిమాలేవీ ఆ డేట్ కి షెడ్యూల్ కాలేదు. ఒకవేళ ఉంటే ఇబ్బంది కాని ప్రస్తుతం ఆ చిక్కు లేదు.

అక్కడి పెద్ద హీరోలతో తలపడితే వసూళ్ళ పరంగా తేడాలు వస్తాయి. ఈ కారణంగానే వార్ తో క్లాష్ పెట్టుకున్న సైరా ఘోరంగా దెబ్బ తింది. సాహో టైంలో ఏ పోటీ లేకపోయింది కాబట్టి అక్కడ పెట్టుబడి సేఫ్ అయ్యింది కాని లేదంటే ఫలితం వేరుగా ఉండేది. అందుకే అక్టోబర్ 16 అన్ని రకాలుగా బెటర్ ఆప్షన్ అని ఫీలైన టీం ఆ మేరకు ప్లానింగ్ లో ఉన్నట్టు సమాచారం. కాని ఇది కూడా మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోంది. ఎంత పార్ట్ షూటింగ్ పూర్తయ్యిందో ఖరారుగా తెలియదు. అలాంటప్పుడు ఖచ్చితంగా అక్టోబర్ 16న రావడం సాధ్య పడుతుందా అనేది వేచి చూడాలి. పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీ అధిక భాగం యూరోప్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş