iDreamPost
android-app
ios-app

టిక్‌టాక్‌లో ‘పొలిటికల్‌’ వార్‌.. ఆరుగురిపై బైండోవర్‌

  • Published Jan 25, 2020 | 5:21 AM Updated Updated Jan 25, 2020 | 5:21 AM
  • Published Jan 25, 2020 | 5:21 AMUpdated Jan 25, 2020 | 5:21 AM
టిక్‌టాక్‌లో ‘పొలిటికల్‌’ వార్‌.. ఆరుగురిపై బైండోవర్‌

ఈ మధ్య చిన్నా పెద్దా, ఆడా, మగా తేడా లేకుండా టిక్‌టాక్‌ వీడియోలతో తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. కొందరు టిక్‌టాక్‌ ద్వారా తమ టాలెంట్‌ను చూపిస్తుంటే మరికొందరు అపభ్యపదజాలం, అశ్లీల వీడియోలు చేస్తూ నెటిజన్లకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌ చేతిలో ఉంది కదా.. అని ఇష్టం వచ్చినట్లు వినియోగిస్తే కష్టాలు తప్పవు. టిక్‌ టాక్‌లో సినిమా డైలాగ్‌లను వినియోగిస్తూ రెచ్చగొట్టే విధంగా విడియోలను చేస్తున్నారనే కారణంతో ఆరుగురు యువకులను బైండోవర్‌ చేశారు పోలీసులు.

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేముల గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రెండు ప్రధాన పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు దూషించుకుంటూ టిక్‌ టాక్‌ వీడియోలను చేశారు. సినిమా డైలాగ్‌లతో కూడిన ఈ వీడియోలు బాగా వైరల్‌ అయ్యాయి. ఈ విషయం పోలీసుల వరకూ చేరింది. శుక్రవారం గ్రామంలో పర్యటించి ఆరుగురిని గుర్తించారు. వివాదాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌ ఎదుట హాజరు పరిచి బైండోవర్‌ చేశారు. భవిష్యత్‌లో వివాదాస్పదమైన టిక్‌ టాక్‌ వీడియోలు చేయరాదని హెచ్చరించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని ఇళ్లకు పంపించారు.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibom