iDreamPost
android-app
ios-app

ఇండియన్ 2లో పొలిటికల్ హీట్

  • Published May 14, 2020 | 11:32 AM Updated Updated May 14, 2020 | 11:32 AM
  • Published May 14, 2020 | 11:32 AMUpdated May 14, 2020 | 11:32 AM
ఇండియన్ 2లో పొలిటికల్ హీట్

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 షూటింగ్ లాక్ డౌన్ కన్నా ముందే క్రేన్ ప్రమాదం వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇంకొద్ది రోజుల్లో రీ స్టార్ట్ చేయబోతున్నారన్న టైంలో ఇప్పుడీ కరోనా రూపంలో ఇంకో బ్రేక్ తప్పలేదు. అనుమతులు రాగానే తిరిగి ప్రారంభిస్తామని ఇటీవలే లైకా సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఇందులో కథ ఏ కోణంలో ఉంటుందన్న దానిమీద అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. మొదటి భాగంలో లంచాల కోసం పోరాడిన సేనాపతి సెకండ్ పార్ట్ లో దేని మీద యుద్ధం చేస్తాడనే దాని గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇండియన్ 2 లో పొలిటికల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయట. వర్తమాన రాజకీయాలను టచ్ చేస్తూనే వాటి మీద సేనాపతి సాగించే పోరు చాలా కొత్తగా ఉంటుందని చెన్నై రిపోర్ట్. సమాజానికి పట్టిన చీడపురుగు రాజకీయమేనని గుర్తించిన సేనాపతి దాన్ని ఎలా ప్రక్షాళన చేశాడన్నదే ఇందులో మెయిన్ పాయింటట. శంకర్ గతంలో అర్జున్ ఒకే ఒక్కడులో ఇలాంటి థీమ్ ని తీసుకున్నారు. అది ఘన విజయం సాధించింది కూడా. ఇప్పుడీ ఇండియన్ 2 కి ఎక్కువ డ్రామా ఉండేలా ప్లాన్ చేశారట.

భారతీయుడులో కొడుకు చనిపోయాడు కాబట్టి ఇందులో అతని స్థానంలో సిద్దార్థ్ ని తీసుకున్నారు. అది కొడుకు పాత్రా లేక మరొకటా అనే క్లారిటీ లేదు. కాజల్ అగర్వాల్ కమల్ కు జోడిగా కనిపించనుండగా రకుల్ ప్రీత్ సింగ్ సిద్దార్థ్ తో జట్టుకట్టే ఛాన్స్ ఉంది. ప్రియా భవాని శంకర్ కూడా మరో కీలక పాత్ర చేస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఇండియన్ 2ని లైకా సంస్థ సుమారు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నట్టు సమాచారం. 2.0 నష్టాలు తెచ్చిన నేపథ్యంలో దీనికి మాత్రం గట్టిగానే కాస్ట్ కటింగ్ చేస్తున్నారట. వచ్చే ఏడాది సమ్మర్ కు ప్లాన్ చేస్తున్న ఇండియన్ 2కి ఇక్కడ ఆర్ఆర్ఆర్ తో పాటు వివిధ భాషల్లో చాలా సినిమాలు గట్టి పోటీనే ఇవ్వబోతున్నాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibom