iDreamPost
android-app
ios-app

Ayodhya: అయోధ్య రామ మందిరం పై బిహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!

  • Published Jan 08, 2024 | 4:51 PM Updated Updated Jan 08, 2024 | 4:51 PM

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరగడానికి సర్వం సిద్ధం అవుతున్నాయి.. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నో వార్తలను మనం వింటూనే ఉన్నాము.. అయితే ఈ క్రమంలో దీనిపై కొన్ని వివాద స్పదమైన వార్తలు కూడా బయటకు వస్తున్నాయి.

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరగడానికి సర్వం సిద్ధం అవుతున్నాయి.. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నో వార్తలను మనం వింటూనే ఉన్నాము.. అయితే ఈ క్రమంలో దీనిపై కొన్ని వివాద స్పదమైన వార్తలు కూడా బయటకు వస్తున్నాయి.

  • Published Jan 08, 2024 | 4:51 PMUpdated Jan 08, 2024 | 4:51 PM
Ayodhya: అయోధ్య రామ మందిరం పై బిహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!

అయోధ్యలో రామయ్య కొలువుతీరబోయే సమయం కోసం కొట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ ఎంతో ప్రణాళికగా సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. మరి కొద్దీ రోజుల్లో ఈ అద్భుతమైన ఘట్టం కన్నుల పండుగగా జరగనుంది. ప్రతి ఒక్కరు ఇంత ఆనందంగా ఎదురు చూస్తున్న తరుణంలో.. కొంతమంది నాయకులు మాత్రం.. దీనికి విరుద్ధంగా మాట్లాడుతూ విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా బిహార్ కు చెందిన మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి. హిందూ మతాన్ని, ఆలయాలను విమర్శిస్తూ ఆ మంత్రి మాట్లాడారు. దీనితో భక్తులు, ఆలయ అధికారులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపనకు ఇప్పుడు రాజకీయ పరంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ పార్టీని విమర్శించే దిశగా బీహార్ మంత్రి ఆర్జేడీ నేత చంద్రశేఖర్ పలు వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే వారు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటారా.. లేక దేవుడి గుడికి వెళ్తారా అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలు అనారోగ్యంగా ఉన్నపుడు ఆసుపత్రులకు వెళ్తారు. ఒకవేళ మీరు గాయపడినపుడు ఎక్కడికి వెళ్తారు. ఆసుపత్రికా లేక దేవాలయానికా. లేదా ఎవరైనా చదువుకోవాలి అన్నా.. పెద్ద అధికారులు కావాలి అన్నా బడికి వెళ్తారా లేదా గుడికి వెళ్తారా ! అంటూ ఇలా మీడియా ముందు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే హిందు మతం పట్ల, జాతి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. అటు ఆలయాలను విమర్శిస్తూ.. ఆసుపత్రులను, విద్యాలయాలను పొగుడుతూ బీహార్ లోని పలు ప్రదేశాల్లో పోస్టర్లు కూడా అంటించారు.

కాగా, ఆ పోస్టర్లను అంటించిన ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్‌కు చంద్రశేఖర్ తన మద్దతును తెలియజేశారు. ఇవే మాటలను సావిత్రిబాయి పూలే కూడా చెప్పారు. దానిలో తప్పేముందని చంద్రశేఖర్ ప్రశ్నించారు. దేవాలయాల కోసం కేటాయించిన స్థలాలను దోపిడీ స్థలాలుగా మార్చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మంత్రి చేసిన వ్యాఖ్యలు సామజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. హిందూ మతాన్ని, ఆచారాలను అవమానపరుస్తునట్లుగా భావిస్తున్నారు. ఈ విషయమై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని.. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరుపనున్నారు. ఈ సమయాన్ని సందర్భాలను అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. ఆధ్యాత్మిక పరంగా చూడకుండా రాజకీయ పరంగా వాడుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ.. ప్రతిపక్ష నేతలు ప్రచారం చేస్తున్నారు. పైగా కొంతమంది రాజకీయ నేతలకు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక అందకపోవడంతో విమర్శలు ఇంకా ఎక్కువగా పెరిగాయి. ఏదేమైనా ఆ రామునిపైన ఉన్న అపార ప్రేమతో, భక్తితో ఎంతోమంది పోరాడిన తరువాత.. ఎట్టకేలకు అయోధ్యలో రామ మందిర కార్యక్రమం జరుగుతుంటే.. దీనిని కూడా రాజకీయంగా మార్చేసి విమర్శిస్తున్నారు. మరి, దేవాలయాలపై బీహార్ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.