iDreamPost
iDreamPost
6.58-అంగుళాల డిస్ప్లే, 50MP ప్రైమరీ కెమెరాతో POCO M5 ఇండియాలో లాంచ్ అయ్యింది. POCO M5 4GB+64GB వేరియంట్ రేటు రూ.12,499 , అదే 6GB+128GB వేరియంట్ అయితే రూ.14,499
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ POCO తాజా బడ్జెట్ ఫోన్ ‘POCO M5’ని భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. స్మార్ట్‌ఫోన్ FHD+ స్క్రీన్‌తో 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్ అదిరిపోయింది. MediaTek Helio G99 SoC చిప్‌సెట్ తో మల్టీటాస్కింగ్ ఈజీ. Arm Cortex A76 Octa-coreతో 2.2GHz క్లాక్ స్పీడ్ , Arm Mali-G57 MC2 గ్రాఫిక్స్ కార్డ్‌తో POCO M5 మంచి మల్టీ టాస్కింగ్, మోడర్న్ గేమింగ్ , లాగ్-ఫ్రీ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వనుంది.
సెప్టెంబర్ 13 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో రానున్న POCO M5, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ పరిమిత కాల ఆఫర్‌లో, ICICI , యాక్సిస్ బ్యాంక్ కార్డ్ తో కొంటే రూ. 1,500 ఫ్లాట్ తగ్గింపును అందుకోవచ్చు. అంటే రేటు రూ. 10,999. ఈ ధరకు కొత్త POCO M5ని కొనుక్కోవచ్చు. ఈ ఫోన్ కొంటే, డిస్నీ+ హాట్‌స్టార్ యేడాది ఉచిత సభ్యత్వాన్ని, 6-నెలలపాటు స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా పొందుతారు. సరికొత్త POCO M5 ప్రీమియం లెదర్‌తో రానుంది. 5000mAh బ్యాటరీ కాబట్టి ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా వస్తుంది. 50MP కెమెరాతో రాత్రిపూటకూడా మంచి ఫోటోలుకూడా తీయొచ్చు.
POCOకు M5 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను ఉంది. గొరిల్లా గ్లాస్ 3 కాబట్టి స్క్రాచెస్ పడవు. OTT ప్లాట్‌ఫారమ్‌లలో HD కంటెంట్‌ను స్ట్రీమింగ్ కోసం Widevine L1 ఎడ్వాంటేజ్ ఉంది. ఇక కెమేరా విషయానికి వస్తే, POCO M5 2MP డెప్త్ , 2MP మాక్రో లెన్స్‌లతో జత చేసిన 50MP ప్రైమరీ సెన్సార్ ఉంది. 8MP ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా ఇంకో స్పెషల్.
ఫోన్ ను 18W ఫాస్ట్ ఛార్జింగ్ చేయొచ్చు. బిగ్ బ్యాటరీ 5,000mAh ఉంది. అదనంగా, స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌లో పొందుపరిచిన సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను వాడటం చాలా సులువు. గేమ్స్, ఓటీటీ సినిమాలు చూసేవాళ్లకు POCO M5 ఆల్ రౌండర్ కిందే లెక్క.